సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎవరేం అనుకుంటారన్నది ఆయనకు అస్సలు పట్టదు. తానేం చేయాలనుకుంటున్నానో చేసేసే ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. తాజాగా ఆయన చేసిన ప్రకటన ప్రపంచానికి షాకింగ్ గా మారింది. వాణిజ్య సంబంధాల విషయంలో అగ్రరాజ్యానికి.. జగడాలమారి చైనాకు మధ్య అస్సలు పొసగని పరిస్థితి. ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు నివ్వెరపోయే పరిస్థితి.
అదే సమయంలో ఆయన ఏ హోదాతో అలాంటి ప్రకటన చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రెండు పెద్ద దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం ముదిరిపోవటమే కాదు.. చైనాను తన దారికి తెచ్చుకునేందుకు ఆ దేశంపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తే.. దానికి ఏ మాత్రం తగ్గని డ్రాగన్ దేశం అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో.. ట్రంప్ వారికి ఎక్కడో కాలిపోయింది. ప్రపంచానికి పెద్దన్న అయిన తాను ఏదైనా చేయాలే కానీ మరెవరూ ఏమీ చేయకూడదని భావించే ఆయనకు చైనా తీరు అస్సలు నచ్చలేదు. తాజాగా చైనా తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన ఊహించని రీతిలో సంచలన పిలుపునిచ్చారు.
అదేమంటే.. చైనాలో ఉన్న అమెరికన్ కంపెనీలన్నింటిని తిరిగి వచ్చేయాలని ఆదేశించారు. చైనా వ్యవహారశైలి నచ్చని ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ లో.. మాకు చైనా అక్కర్లేదు. ఆ మాటకు వస్తే వాళ్లతో సంబంధం లేకుండా ఉండటమే మంచిది. అమెరికా నుంచి చైనా కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో సంపదను కొల్లగొడుతోంది. దీన్ని ఇక ఆపాల్సిందేనని వ్యాఖ్యానించారు.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కంపెనీలన్ని చైనాను వదిలేయాలని.. స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే.. ఏ హోదాలో అమెరికన్ కంపెనీల్ని ట్రంప్ ఈ తరహా ఆదేశాలు జారీ చేశారన్నది అర్థం కాని పరిస్థితి. లాభాలు.. వ్యాపార ప్రయోజనాలు మాత్రమే చూసుకునే కార్పొరేట్ కంపెనీలు ట్రంప్ ఆదేశాలకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా చెప్పాలి.
ట్రంప్ ప్రకటనతో ఫెడ్ ఎక్స్.. అమెజాన్.. యూపీఎస్.. యూఎస్ పోస్టల్ సర్వీసెస్ తో సహా రవాణా కంపెనీలకు సైతం ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల దేశాల మధ్య పోరు రానున్న రోజుల్లో మరెలా మారుతుందన్నది ఇప్పుడు కాస్తంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.