ఇదో వైరస్ కాదు.. మాపై దాడే: ట్రంప్

Update: 2020-04-23 13:30 GMT
కరోనా వైరస్ ఒక ఫ్లూ వైరస్ కాదని.. ఖచ్చితంగా ఇది తమపై దాడిగానే పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి.. పోరాడడానికి ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ ప్రకటించడం తప్ప అమెరికాకు మరో మార్గం లేదని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తాజాగా ట్రంప్ మాట్లాడుతూ కరోనా వైరస్ అమెరికాలో బాగా విస్తరించిందన్నారు. గురువారం నాటికి అమెరికాలో 8.42,376   కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని - 46,785 మంది మరణించారని - ఈ రెండు గణాంకాలు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కరోనావైరస్ తో అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి జారుతోందని.. అందుకోసమే తాము  మెడికల్ రెస్పాన్స్ ఫండింగ్‌ లో 300 బిలియన్ డాలర్లకు పైగా ఆమోదించడానికి సిద్ధమవుతున్నామన్నారు. కానీ  డెమొక్రాట్లు మరో భారీ ఉద్దీపన బిల్లు కోసం డిమాండ్ చేస్తూ అడ్డుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి.

మహమ్మారి వల్ల అమెరికా వ్యాప్తంగా 22 మిలియన్లకు పైగా ఉద్యోగాలు కోల్పోయారని.. ఆ నష్టాలను ఎదుర్కోవటానికి ట్రంప్ మరియు కాంగ్రెస్ ఇప్పటికే 2.2 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ఆమోదిందన్నారు.

  24 ట్రిలియన్ డాలర్ల జాతీయ రుణం గురించి ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ తాము కరోనాపై జరుగుతున్న యుద్ధాన్ని గెలవడానికి ఏం అవసరమో అదే ఖర్చు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు.


Tags:    

Similar News