అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు ఎలా పరిగణిస్తున్నారన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని ట్రంప్... తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతున్నారు. ఈ దిశగా జెట్ స్పీడుతో వెళుతున్న ట్రంప్... తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మిలటరీలో హిజ్రాల చేరికను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక మిలటరీ సేవల్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు సంతకం చేసిన మెమోను వైట్ హౌస్ విడుదల చేసింది.
అమెరికా మిలటరీ విభాగంలో సేవ చేసేందుకు హిజ్రాలు అనర్హులని - వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ ట్రంప్ గత నెలలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన నెలలోనే తాజా నోటీసులు జారీచేశారు. వెనువెంటనే హిజ్రాలకు ప్రభుత్వ నిధులను నిలిపివేయాలని అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్ - హోమ్ లాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ కు ట్రంప్ ఆదేశాలు జారీ అయిపోయాయి. వెరసి ఇప్పుడు హిజ్రాలను ట్రంప్ కోలుకోని విధంగా దెబ్బ కొట్టాడన్న వాదన వినిపిస్తోంది.
తమపై ట్రంప్ ట్వీట్ చేసినప్పుడే హిజ్రాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్ మెంట్ సెంటర్ వద్దకు భారీగా చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేశామని మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అయితే.. మిలటరీ జనరల్స్, నిపుణులను సంప్రదించాకే హిజ్రాలపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని స్పష్టం చేశారు.