అంత సాహ‌సం చేసిన ట్రంప్

Update: 2017-08-22 08:40 GMT
సూర్య‌గ్ర‌హ‌ణం వేళ‌.. సూర్యుడ్ని నేరుగా చూడ‌కూడ‌ని చిన్న‌పిల్లాడికి తెలిసిందే. అయితే.. తెంప‌రి ట్రంప్ త‌న‌దైన రీతిలో వ్య‌వ‌హ‌రించారు. గ్ర‌హణం వేళ ప్ర‌మాద‌క‌ర‌మైన కిర‌ణాలు వెలువడ‌తాయి.అందుకే.. స్యూరుడ్ని నేరుగా చూడ‌కుండా ప్ర‌త్యేక క‌ళ్లాద్దాల‌తో చూస్తుంటారు.

తాజాగా అమెరికాలో క‌నిపించిన సంపూర్ణ సూర్య‌గ్ర‌హాణాన్ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎవ‌రూ చేయ‌ని సాహ‌సాన్ని చేశారు. క‌ళ్ల‌జోడు లేకుండా సూర్యుడ్ని నేరుగా చూసే ప్ర‌య‌త్నం చేశారు. కొద్ది సెక‌న్ల పాటు ఆ ప‌ని చేసిన ఆయ‌న తీరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సూర్యుడ్ని నేరుగా చూడ‌కూడ‌ద‌ని.. అలా చూస్తే క‌ళ్ల‌కు ప్ర‌మాద‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నా.. వాటిని ప‌ట్టించుకోన‌ట్లుగా గ్ర‌హ‌ణ స‌మ‌యంలో సూర్యుడికేసి ట్రంప్ చూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. శ్వేత‌సౌధం బాల్క‌నీ నుంచి ట్రంప్‌.. ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా గ్ర‌హణాన్ని చూశారు. బాల్క‌నీలో కొన్ని సెక‌న్ల పాటు గ్ర‌హ‌ణంలోని సూర్యుడ్ని చూసిన ట్రంప్‌.. ఆ త‌ర్వాత మాత్రం ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని చూశారు. తాను చూసిన సూర్య‌గ్ర‌హ‌ణాన్ని మెలానియాతో ఏదో చెప్ప‌టం క‌నిపించింది.  

ఈ సూర్యగ్ర‌హ‌ణ ప్ర‌భావం భార‌త్ మీద లేదు. అమెరికాలోని ప‌శ్చిమ తీరంలోని ఒరెగాన్ లోని లింక‌న్ బీచ్ లో మొద‌లైన ఈ ఖ‌గోళ అద్భుతం అమెరికాలోని 14 రాష్ట్రాల్లో క‌నిపించింది. గ్ర‌హ‌ణ ప్ర‌భావంతో అమెరికాలోని ప‌లు రాష్ట్రాలు ప‌గ‌లే చీక‌టిగా మారాయి. ఒరెగాన్ రాష్ట్రంలో మొద‌లైన ఈ గ్ర‌హ‌ణం ద‌క్షిణ క‌రోలినా రాష్ట్రంలో ముగిసింది. దాదాపు 90 నిమిషాల‌పాటు గ్ర‌హ‌ణం ఉంది. ఈ సూర్య‌గ్ర‌హాణాన్ని చూసేందుకు ప్ర‌పంచం న‌లువైపుల నుంచి ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు అమెరికాకు వ‌చ్చారు.

Full View
Tags:    

Similar News