ఇది సరిపోదా..ఇంకా కావాలా ట్రంప్

Update: 2018-02-14 08:59 GMT
 అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. భార‌త్ నుంచి అమెరికాకు దిగుమ‌త‌య్యే మోట‌ర్ సైకిళ్ల‌పైనా అధికంగా ప‌న్నును వ‌సూలు చేస్తామ‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ప‌న్ను వ‌సూళ్ల‌పై భార‌త్ తీరును త‌ప్పు బ‌ట్టిన ట్రంప్ భార‌త్ లో హార్లీ డేవిడ్ స‌న్ బైక్ ల‌పై  అధికంగా ప‌న్ను వ‌సూలు చేయ‌డంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

గ‌తంలో 800సీసీ సామ‌ర్ధ్యం క‌న్నా త‌క్కువ ఉన్న బైకుల‌పై 60శాతం - 800సీసీ అంత‌క‌న్నా ఎక్కువ సామ‌ర్ధ్యం ఉన్న బైక్ ల‌పై 75శాతం ప‌న్నును వ‌సూలు చేసేవారు. అదికాస్త  విదేశాల్లోనే పూర్తిగా తయారై దిగుమతి చేసుకునే  బైక్‌ లపై ప్రాథమిక సుంకాన్ని 50 శాతానికే పరిమితం చేసింది. అయినా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవల భారత ప్రభుత్వం హార్లీడేవిడ్‌ సన్‌ బైక్‌ లపై టారిఫ్‌ ను 75శాతం నుంచి 50శాతానికి తగ్గించ‌గా అది స‌రిపోద‌ని ట్రంప్ అన్నారు. రెండు దేశాల్లో ఒకే రకమైన పన్ను ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు దేశాల్లో 'రెసిప్రోకల్‌ ట్యాక్స్‌' విధానం ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News