ఐక్యరాజ్యసమితి మీదే నోరు పారేసుకున్న ట్రంప్

Update: 2016-12-28 08:15 GMT
మర్యాద.. గౌరవం అన్న పదార్థాలు లేని వారు.. ఎవరిని పెద్దగా లెక్క చేయరు. దీనికి తోడు అలాంటి వారిలో తెంపరితనం పాళ్లు ఎక్కువగా ఉంటే వారి నోటికి అడ్డూఆపూ ఉండదు. అమెరికా అధ్యక్ష పదవిని త్వరలో చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇదే తరహాకు చెందినవి. ఐక్యరాజ్యసమితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

వ్యక్తుల మీదా.. వర్గాల మీదా.. దేశాల మీద నోరుపారేసుకున్న ట్రంప్.. తాజాగా ఐక్యరాజ్య సమితి మీద తన మాటల తూటాల్ని వదిలారు. ఐక్యరాజ్య సమితిని కాసేపు సరదాగా మాట్లాడుకునే క్లబ్ గా అభివర్ణించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఐక్యరాజ్యసమితి ఫ్యూచర్ మీద సందేహాలు కలిగేలా చేసే పరిస్థితి చెప్పాలి.

ఐక్యరాజ్యసమితి శక్తిసామర్థ్యాలు చాలా గొప్పవని.. అయితే.. ప్రస్తుతానికి మాత్రం ఏదో పదిమంది కలుసుకొని.. కాసేపు ముచ్చట్లు చెప్పుకొని మంచిగా కాలక్షేపం చేసే క్లబ్ గా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. వెస్ట్ బ్యాంక్.. జెరూసలెంలలోని కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తన స్థావరాల్ని ఏర్పాటు చేసుకోవటాన్ని నిరసిస్తూ భద్రతా మండలిలో జరిగే ఓటింగ్ లో పాల్గొనకూడదని అమెరికా అధ్యక్షుడు ఒబామా డిసైడ్ అయ్యారు.

అయితే.. ఇలా హాజరు కాకుండా ఉండే కన్నా.. తమకున్న విశేష అధికారమైన వీటోతో తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టేలా చేయాలన్నది ట్రంప్ ఆలోచన. వ్యతిరేకించేటప్పుడు బాహిరంగంగా చెప్పేస్తే పోయేదేముందన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News