అందరిలా వ్యవహరిస్తే ఆయన ట్రంప్ అవ్వరు కదా. ఏ దేశాధ్యక్షుడు చేయని రీతిలో తన ప్రత్యర్థుల పట్ల వ్యవహరించటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రమే సాధ్యమవుతుందేమో. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి మీడియాతో ఏ మాత్రంగా ఫ్రెండ్లీగా ఉండని ఆయన.. తన తప్పుల్ని ఎత్తి చూపించిన వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతుంటారు. వారిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయటమే కాదు.. చులకనగా మాట్లాడేస్తుంటారు.
ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా మీడియాతో పంచాయితీని మాత్రం వదులుకోలేదు ట్రంప్. అధ్యక్ష బాధ్యతను చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేక గళాన్ని వినిపించే న్యూయార్క్ టైమ్స్‌ను.. సీఎన్ ఎన్ ఛానల్ తీరుపై తన అక్కసును ప్రదర్శించే ట్రంప్.. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన అందరికి షాకిచ్చారు.
అమెరికాలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎన్ ఎన్ ఛానల్ పై తాను దాడి చేస్తున్నట్లుగా చూపించే ఒక ఎడిట్ చేసిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయటం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే కాదు.. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడు కూడా బరి తెగించని రీతిలో మీడియా పట్ల తనకున్న కోపాన్ని ప్రదర్శించారు ట్రంప్. ఇంతకీ ఈ వీడియోలో ఉన్న ట్రంప్ ఒక వ్యక్తి మీద పిడిగుద్దులు గుద్దటం.. కిందపడేసి ముష్టిఘాతాలు విసరటం లాంటివి ఎప్పుడు చేశారన్న విషయంలోకి వెళితే.. పదేళ్ల కిందట డబ్ల్యూ డబ్ల్యూ కుస్తీ పోటీకి హాజరయ్యారు. అందులో సరదాగా ఒక వ్యక్తిని కిందపడేసి చితకబాదినట్లుగా నటించారు. తాజాగా సీఎన్ ఎన్ మీడియా సంస్థతో తనకున్న లొల్లి నేపథ్యంలో.. ఈ వీడియోలో తాను చితకబాదే వ్యక్తి ముఖాన్ని సీఎన్ఎన్ ఛానల్ లోగోను ఉంచటం ద్వారా తానెంత ఆగ్రహంగా ఉన్నానన్న విషయాన్ని చెప్పేశారు. ఈ వీడియోను ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ఫ్రాడ్ న్యూస్ సీఎన్ ఎన్.. ఎఫ్ ఎన్ ఎన్ అని రాశారు. మీడియా కడుపు మండేలా ఉన్న ఈ పోస్ట్ చూస్తే.. మీడియా పట్ల తనకున్న వికారపు ఆలోచనల్ని బాహాటంగా బయటపెట్టేలా ట్రంప్ పోస్ట్ ఉందని.. వ్యవస్థల పట్ల ఆయనకున్న చులకన భావం తాజా వీడియో చూస్తే అర్థమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/