రెండు చోట్ల హిల్లరీ గెలిచినా ట్రంప్ దే అధిక్యం

Update: 2016-11-08 14:18 GMT
మరికొన్ని గంటల తర్వాత కానీ బయటకు రాని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పుడే రావటం ఏమిటన్న ప్రశ్న కొందరిలో వ్యక్తమయ్యే పరిస్థితి. అక్కడి పోలింగ్ విధానం కారణంగా ఇలాంటి పరిస్థితి. పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసేసి ప్రకటించటం అక్కడ ఆనవాయితీ. ఇందుకు తగ్గట్లే తాజాగా న్యూహ్యాంప్ షైర్ లో విడుదలైన ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న టైమింగ్ తేడాల కారణంగా న్యూహ్యాంప్ షైర్ లో తొలుత పోలింగ్ జరగటమే కాదు.. పోలింగ్ పూర్తి అయి ఫలితాలు కూడా వెల్లడైన పరిస్థితి. అయితే.. అమెరికా అధ్యక్షఎన్నికల సైజులో దీని పరిణామం నలుసు మాత్రమే. కాకుంటే.. తొలిదశలో వచ్చిన తొలి పోలింగ్ ఫలితం కాబట్టి కాస్తంత ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పాలి. తొలుత ఒక చిన్న గ్రామంలో హిల్లరీ విజయం సాధించగా.. డెమొక్రాట్లు శుభారంభం చేసినట్లుగా భావించారు. అయితే.. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండా అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

న్యూహ్యాంప్ షైర్ లోని డిగ్జివిల్లే నాచ్.. హార్డ్స్ లొకేషన్ రెండు పట్టణాల్లో హిల్లరీ విజయం సాధించారు. అయితే.. అంతిమంగా మూడు ఊళ్లు ఉన్న న్యూహ్యాంప్ షైర్ లో ట్రంప్ అధిక్యంలోకి దూసుకెళ్లటం హిల్లరీ క్లింటన్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండు చోట్లు హిల్లరీ గెలిచినా.. మొత్తంగా ట్రంప్ అధిక్యంలో ఎలా కొనసాగుతారు? అదెలా సాధ్యమన్న విషయంలోకి వెళితే.. మూడు ఊళ్లలో రెండింటిలో హిల్లరీ విజయం సాధించినా.. మొత్తంగా ఓట్లు పోలైన విషయంలో ట్రంప్ ముందు ఉండటంతో హిల్లరీ కంటే ట్రంప్ అధిక్యంలో ఉండే పరిస్థితి. అయితే.. ఈ మూడు ఊళ్లలో మొత్తంగా వంద ఓట్ల కంటే తక్కువగాఉన్న నేపథ్యంలో ఈ ఫలితాన్ని సీరియస్ గా తీసుకోలేమనే చెప్పాలి. కాకుంటే.. ఈ ఫలితం స్పష్టం చేసేదేమిటంటే.. హిల్లరీ.. ట్రంప్ ల మధ్య పోటీ ఏకపక్షంగా ఏమీ ఉండదని.. పోటా పోటీగా.. ఢీ అంటే  ఢీ అన్నట్లుగా ఉందన్న విషయాన్ని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News