ట్రంప్ మామ డెసిష‌న్ అల్లుడికే దెబ్బేసింది

Update: 2017-05-12 09:25 GMT
ల‌క్ష్యం చేసుకొని మ‌రీ సాధించాల‌ని.. జ‌నాల ప‌ని ప‌ట్టాల‌ని చేసే ప్ర‌య‌త్నం.. అలా చేస్తున్న వారికి ఇబ్బందిగా మారుతుంద‌న్న విష‌యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు ఇప్పుడు అనుభ‌వంలోకి వ‌చ్చి ఉంటుంది. తాను నిత్యం జ‌పించే లోక‌ల్ మాట‌తో ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు ఇబ్బందిక‌రంగా మారిన వైనం తెలిసిందే. ప‌లు కంపెనీలకు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని రీతిలో మారిన ఈ నిర్ణ‌యం.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఇంట్లోనూ ఇబ్బందులు సృష్టిస్తోంద‌ని చెబుతున్నారు.

అమెరికాలో ఉద్యోగాలు స్థానికుల‌కే ప్రాధాన్యం ఇవ్వాలంటూ వీసా విధానాన్ని క‌ఠిన‌త‌రం చేసిన ట్రంప్ నిర్ణ‌యంతో ఇంటి అల్లుడికే ఇబ్బందిక‌రంగా మారింద‌ట‌. ట్రంప్ అల్లుడు.. వైట్ హౌస్ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జారెద్ కుష్న‌ర్ మామ నిర్ణ‌యంతో ఇబ్బందుల‌కు గురి అవుతున్నాడ‌ట‌.

కొత్త‌గా వ‌చ్చిన వీసా విధానంతో.. ట్రంప్ అల్లుడికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి కొత్త ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ట‌. ట్రంప్ అల్లుడి కంపెనీ ఫెడ‌ర‌ల్ వీసా ప్రోగ్రాంను ఉప‌యోగిస్తోంది. ఈ కంపెనీ న్యూజెర్సీలోని రెండు విలాస‌వంత‌మైన ట‌వ‌ర్స్ నిర్మాణం కోసం చైనా పెట్టుబ‌డిదారుల నుంచి 150 మిలియ‌న్ డాల‌ర్లను తీసుకుంది. తాజా వీసా విధానంలో ఈబీ5 ప్రోగ్రాం ద్వారా విదేశీయులు క‌నీసం 5 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెడితే వీసాను సుల‌భ‌త‌రం చేయొచ్చు. దీన్ని వీసా ఫ‌ర్ క్యాష్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా జ‌రిగిన మార్పుల‌తో వీసా రూల్స్ మ‌రింత క‌ఠినంగా మార‌నుండ‌టంతో.. చైనా నుంచి వ‌చ్చే పెట్ట‌బ‌డుల‌కు గండి ప‌డే అవ‌కాశం ఉంద‌ట‌. ఈ విష‌యంపై ట్రంప్ అల్లుడు కానీ.. వైట్ హౌస్ కానీ అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఎవ‌రికో పొగ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని అనుకున్న ట్రంప్ కు ఇంట్లోనే ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌న్న మాట‌. జ‌నాల ఉసురు పోసుకుంటే ఇలాంటి తిప్ప‌లు వ‌చ్చి ప‌డ‌తాయి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News