తనదైన శైలిలో తుంటరి పనులకు - ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని కెలికేందుకు కేరాఫ్ అడ్రస్ గా ఉందే...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితబోధ చేస్తే ఎలా ఉంటుంది? మంచి చెడూ...గురించి వివరిస్తే...ఎలా ఉంటుంది నిజంగా ఆసక్తికరమే కదా? తాజాగా అదే జరిగింది. జీవితంలో ఎప్పుడూ మందు, సిగరెట్ ముట్టలేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గురువారం వైట్ హౌజ్ నుంచి ఆయన యాంటీ డ్రగ్ సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చిన సందర్భంగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి కారణం తన అన్న ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ అని కూడా ట్రంప్ చెప్పారు.
తన అన్న ఫ్రెడ్ ఆల్కహాల్ కు బానిసై 43 ఏళ్ల వయసులోనే చనిపోయినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫ్రెడ్ తన జీవితంలో ఆల్కహాల్ వల్ల పడిన క్షోభను గమనించే తాను ఎప్పుడూ మందు - సిగరెట్ జోలికి వెళ్లలేదని ట్రంప్ చెప్పారు. ``నాకు ఓ అన్న ఉండేవాడు. అతను నాకన్నా చాలా అందంగా, బాగా ఉండేవాడు. కానీ అతనికి తాగుడు సమస్య ఉండేది. తాగొద్దు - తాగొద్దు అని అతను నాతో ఎప్పుడూ చెప్పేవాడు. అతని మాటను గౌరవించే నేను ఎప్పుడూ తాగుడుకు దూరంగానే ఉన్నాను`` అని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఓపియం బాధితులు పెరిగిపోతున్న ఈ సంక్షోభ సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ట్రంప్ విధించారు. డ్రగ్స్‌కు బానిసైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తాను తన అన్నను చూసే తెలుసుకున్నట్లు ట్రంప్ చెప్పారు.
డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన హామీ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా ఉండేందుకు ఓ పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. చిన్నతనంలోనే ఈ విషయంపై అవగాహన వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు.