ఇదే విషయాన్ని ఎవరైనా చెబితే.. బడాయి.. అతిశయోక్తి అని కొట్టి పారేయొచ్చు.కానీ.. ఈ విషయానికి సాక్ష్యులుగా జర్నలిస్టులు.. ఫోటోలు ఉండటంతో నమ్మక తప్పనిసరి. ఎందుకంటే.. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా భారత ప్రధాని దగ్గరకు రావటం.. మాట్లాడటం అన్నది అనూహ్యమని చెప్పక తప్పదు.
అందులోకి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పలు దేశాల అధినేతలు ఉన్న వేదిక వద్ద.. ట్రంప్ లాంటి అగ్రదేశాధినేత మోడీ వద్దకు తనకు తాను రావటం మామూలు విషయం కాదని చెప్పాలి.
ఈ అనూహ్య పరిణామం జర్మనీలోని హాంబర్గ్ లో జరుగుతున్న జీ20 దేశాల సమావేశంలో చోటు చేసుకుంది. శనివారం సమావేశం ప్రారంభానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత ప్రధాని మోడీ ఉన్న చోటకు స్వయంగా వచ్చారు. మోడీతో ఏదో మాట్లాడారు. వారు అలా మాట్లాడుతుండగా.. అక్కడికి మిగిలిన నేతలు చుట్టూ చేరటంతో వారి సంభాషణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా మోడీ ఇమేజ్ ఎంతగా పెరిగిందనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాతో పాటు.. నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ట్వీట్ ద్వారా వెల్లడిస్తూ.. అందుకు సాక్ష్యంగా ఫోటోను జత చేశారు.