కరోనా వైరస్ తో అమెరికా అల్లకల్లోలం అవుతోంది. కంట్రోల్ చేయలేక అధ్యక్షుడు ట్రంప్ తల ప్రాణం తోకకు వస్తోంది. దీనంతటికీ కారణం చైనానే అని.. చైనానే కరోనా వైరస్ ను పుట్టించిందని ట్రంప్ ఆరోపించారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) మాత్రం అదేం కాదని చైనాను వెనకేసుకొచ్చింది. దీంతో ట్రంప్ ఇప్పటికే డబ్ల్యూ.హెచ్.వోకు అమెరికా ఇవ్వాల్సిన 3వేల కోట్లు నిధులు ఆపేశాడు.
తాజాగా చైనాకు మద్దతిస్తున్న డబ్ల్యూ.హెచ్.వోకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేయడానికి అమెరికా నిపుణులను అనుమతించాలని చైనాను ట్రంప్ డిమాండ్ చేశారు. చైనా దీనికి నో చెప్పడంతో డబ్ల్యూ.హెచ్.వోపై యుద్ధానికి ట్రంప్ సిద్ధమయ్యాడు.
డబ్ల్యూ.హెచ్.వోపై నుంచి అమెరికా సహా మిత్రదేశాలు వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఇదే జరిగితే అదో పెద్ద పరిణామంగా మారనుంది. చైనాతో చేతిలో కీలుబొమ్మగా మారిన డబ్ల్యూ.హెచ్.వోను ఇక ఎంత మాత్రం సహించనని.. ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నారు. చైనాతో, డబ్ల్యూ.హెచ్.వోతో ఫైట్ లో ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.