ప్రముఖుల మైనపు బొమ్మలను కొలువుదీర్చే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోకి అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చేశారు. ట్రంప్ మైనపు బొమ్మను శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ కాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో డోనాల్డ్ ట్రంప్ బొమ్మను ప్రతిష్టించనున్నారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఆవిష్కరణకు సిద్ధమయ్యారు.
నేవీ షూట్ లో వైట్ షర్ట్ - రెడ్ టైతో మైనపు ట్రంప్ ఆకట్టుకుంటున్నారు. ట్రంప్ తలవెంట్రుకలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా స్పెషలిస్టులను తీసుకొచ్చారు. మిగతా వారి చిత్రాల కంటే ట్రంప్ మైనపు బొమ్మ విషయంలో కాస్త ఎక్కువే శ్రద్ధ పెట్టాల్సి వచ్చిందని టుస్సాడ్స్ ప్రతినిధులు తెలిపారు. కాగా ట్రంప్ బొమ్మ అధికారికంగా ఆవిష్కరించడానికి ముందే హల్ చల్ చేస్తోంది. ట్రంప్ నిరంతరం కనిపించే రీతిలో తీర్చిదిద్దిన ఆయన మైనపు బొమ్మతో ఓ అభిమాని అప్పుడే సెల్ఫీ కూడా దిగింది. కాగా..అమెరికా 45వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అనే ప్రచార నినాదమే ప్రధాన ఇతివృత్తంగా జరగనున్న ట్రంప్ పదవీ స్వీకార ప్రమాణాన్ని వీక్షించడానికి వేలాదిమంది ప్రజలు చేరుకోవడం ఆరంభమైంది. ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించగా అధికారికంగా ప్రమాణ స్వీకార సంబరాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. వీరిలో అనేకమంది ఇండియన్ అమెరికన్స్ కూడా వున్నారు. రెండు బైబిళ్ళను ఉపయోగించి ట్రంప్ ప్రమాణం చేస్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/