ఏడాదిలోపే ట్రంప్ దిగిపోతాడట!

Update: 2016-11-13 04:37 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఆనందం ఆవిర‌య్యే వార్త ఇది. అదే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థులకు తీపి క‌బురు వంటి జోస్యం. అమెరికా ఎన్నిక‌ల్లో ట్రంప్‌ గెలుస్తాడని ప్రొఫెసర్ అలెన్ లిచ్‌ మాన్ జోస్యం చెప్పారు. ప‌లువురు దాన్ని కొట్టిపారేసిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ చెప్పిన జోస్యం నిజమైన సంగతి తెలిసిందే. రిపబ్లికన్లలో ట్రంప్ మద్దతుదారులు అప్పడు సంబురపడ్డారు. వారే ఇప్పుడు లిచ్‌మాన్ చెప్తున్న తాజా జోస్యం చూసి కంగారుపడుతున్నారు. ఇంత ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామానికి లిచ్ మాన్ లాజిక్‌ లే కార‌ణం కావ‌డం విశేషం.

డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో ఉండకపోవచ్చునని, రిపబ్లికన్ కాంగ్రెస్ అభిశంసించడం ద్వారా ఆయనను గద్దె దింపే అవకాశం ఉన్నదని లిచ్‌మాన్ అంటున్నారు. నిత్యం వివాదాల్లో ఉండే ట్రంప్ స్థానంలో ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైక్ పెన్స్‌ను నియమిస్తారని చెప్పారు. తమ మాట వినని - అదుపులో ఉండని ట్రంప్ కంటె తమకు బాగా తెలిసినవాడు - తమ చెప్పుచేతల్లో ఉండే పెన్స్ పైనే ఎక్కువ మంది రిపబ్లికన్ నేతలకు విశ్వాసం ఉండటమే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ స్వప్రయోజనాల కోసం జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టడం వంటి చర్యలు ఆయనను అభిశంసించడానికి అవకాశమిస్తామయని లిచ్ మ‌న్ అన్నారు. కాగా ఇది ఏడాదిలోపే జరుగుతుందని న్యూయార్క్ టైమ్స్ ఒపెడ్ కాలమిస్ట్ డేవిడ్ బ్రూక్స్ జోస్యం చెప్పారు. మూఢవిశ్వాసాలు - నిజాయితీ లేకపోవడం - హామీలు నిలబెట్టుకోనందువల్ల ట్రంప్ ఏడాదిలోగానే రాజీనామా చేయడమో, అభిశంసనకు గురికావడమో జరుగుతుందని బ్రూక్స్ అంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.  దీంతో ఇపుడు రిప‌బ్లిక‌న్లలో కొత్త ఆందోళ‌న మొద‌లైంద‌ని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News