పాపం ఆ జాతీయ పార్టీకి ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఒక ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవడం కంటే దైన్యం వేరేది ఉంటుందా. ఆ పార్టీ దేశాన్ని ఏలే పార్టీ. దేశంలోని అన్ని పార్టీలని అల్లల్లాడిస్తున్న పార్టీ. కాంగ్రెస్ కి కనిపించకుండా చేస్తున్న పార్టీ. అలాంటి పార్టీ జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్లుగా ఏపీలో రాజకీయ ముఖచిత్రం చెబుతోంది అంటే అంతకంటే నగుబాటు వేరేది ఉంటుందా.
అయినా ఇది రాజకీయం. తప్పదు. ఎవరితో అయినా కలవవచ్చు. ఎవరితో అయినా ముందుకు సాగాల్సిన అనివార్యత రావచ్చు. ఏపీలో చూస్తే బీజేపీ 2019 ఎన్నికల్లో ఓడిపోగానే తెలివిగానే ప్లాన్ చేసింది. జనసేనతో కలిస్తే పవన్ సినీ గ్లామర్ తో పాటు ఆయన సామాజికవర్గం కూడా జతకలసి ఏపీలో గట్టిగా నిలదొక్కుకోవచ్చు అన్నదే కమలనాధుల స్ట్రాటజీ. కానీ జనసేన విషయం వేరుగా ఉంది.
రెండు పార్టీలు పేరుకు పొత్తులు పెట్టుకున్నా ఎవరి జెండా వేరు, అజెండా వేరు అన్నట్లుగా కధ నడిపిస్తున్నారు. గత ఏణ్ణర్ధంగా చూస్తే బీజేపీకి జనసేనకు మధ్య గ్యాప్ వచ్చింది అన్నది అందరూ అంటున్నారు. ఇక విశాఖలో జనసేనానిని హొటల్ లో రెండు రోజుల పాటు నిర్బంధించడం ఆ మీదట ఆయన విజయవాడకు వచ్చి పార్టీ ఆఫీసులో బీజేపీ పొత్తు మీద హాట్ హాట్ కామెంట్స్ చేయడం ఆ వెంటనే చంద్రబాబుతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి.
ఇదే నేపధ్యంలో బీజేపీతో పొత్తు ఉండదు అని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే బీజేపీ నేతలు సోము వీర్రాజు సునీల్ డియోధర్ టీడీపీతో పొత్తు ఉండదని చెప్పడమే. పవన్ ఆలోచన అయితే 2014 పొత్తులను రిపీట్ చేయాలని. కానీ బీజేపీ మాత్రం జనసేనతోనే ఏపీలో పోటీకి దిగాలని. దాంతోనే తేడా వస్తోంది. అయితే చంద్రబాబుతో పొత్తు దాదాపుగా ఖరారు చేసుకుని జనసేనాని ముందుకు పోతున్నారు. అదే టైం లో మనసు మాట మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే అది బీజేపీ మాత్రమే అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు.
దాంతో బీజేపీ పరిస్థితి ఇపుడు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది అంటున్నారు. అనంతపురంలో సోము వీర్రాజు బీజేపీ జనసేనల పొత్తు మీద ఏం మాట్లాడారో తెలియదు కానీ వార్తలు మాత్రం రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది అన్నట్లుగానే వచ్చాయి. జనసేన నాయకుడు వాడిన అనుచిత భాష మీద విలేకరులు అడిగిన ప్రశ్నలకు సోము మౌనం దాల్చడం పైనే దూరం పెరిగింది అని అంతా అనుకుని విశ్లేషించారు. నిజానికి దీని మీద మిత్రుడికి సపోర్ట్ గా మాట్లాడాలి.
అయితే మరి ఏం జరిగిందో కానీ సోము వీర్రాజు తెల్లారుతూనే వీడియో క్లిప్పింగ్ ఒకటి మీడియాకు విడుదల చేశారు. జనసేనతో తో పాటు జనంతోనే తమ పొత్తు ఉంటుందని, పదే పదే ఇదే మాటను తాను అంటూ ఉంటానని, దీనిని ఎవరైనా వక్రీకరిస్తే తప్పు వారిదే అని ఖండించారు. మొత్తానికి జనసేన వెంట బీజేపీ పడుతోంది అన్నది క్లారిటీగా అందరికీ అర్ధం అవుతోంది. అదే టైం లో పవన్ నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే లేవు. దాంతో ఇది ఒంటి చేయి చప్పట్లుగానే ఉంది. ఏది ఏమైనా జాతీయ పార్టీగా ఉంటూ బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ జనసేనతో పొత్తు ఉంది అంటే నమ్మరేమి అని తెగ ఫీల్ అవుతోంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.