ఆసక్తికర వ్యాఖ్యలకు వేదికగా నిలిచింది హెచ్ టీ లీడర్ షిప్ సమ్మిట్. ఈ సదస్సుకు హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంగించారు. వచ్చామా.. మాట్లాడామా.. వెళ్లామా అనకుండా ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తన వ్యాపార ప్రత్యర్థి సభాముఖంగా చేసిన వ్యాఖ్యలకు ఏ మాత్రం తగ్గకుండా చురకలేశారు. ఫ్రెండ్ అంటూనే పంచ్ లు వేసి ముకేశ్ అంబానీ.. అందరి ముందు బిజినెస్ రూల్స్ ను చెప్పుకొచ్చారు. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజమేనని చెప్పిన ఆయన.. విలువైన వ్యాఖ్యలు చేశారు.
జియో ఎంట్రీతో టెలికం రంగంలో నష్టాలు మొదలయ్యాయని ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలపై ముకేశ్ అంబానీ రియాక్ట్ అయ్యారు. వ్యాపారంలో లాభ నష్టాలు మామూలేనని.. వ్యాపారంలో లాభాల కోసం రెగ్యులేటర్లు ప్రభుత్వం వైపు చూడటం మానుకోవాలంటూ గొంతులో వెలక్కాయ పడేలా మాట్లాడారు.
టెలికం రంగంలో లాభనష్టాలకు జియోను బాధ్యుల్ని చేస్తూ నిందించటం మంచిది కాదన్న ముకేశ్ అంబానీ.. జియో వచ్చాక దేశంలోని వినియోగదారులు లాభపడ్డారా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. జియో ఎంట్రీతో మొబైల్ బ్రాండ్ బ్యాండ్ మార్కెట్లో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యిందన్నారు.
అమెరికా.. చైనా కంటే భారత్ లోనే ఎక్కువ డేటా వినియోగమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. టెలికం రంగంలో ఉన్న మనమంతా లాభనష్టాల్ని సమానాంగా స్వీకరించాలని భావిస్తానని చెప్పారు. తన విషయానికి వస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లామా? వినియోగదారుల మనసులు గెలుచుకున్నామా? లేదా? అనేదే ముఖ్యమని.. వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయన్నప్పుడు ఎవరు గెలుస్తారు? ఓడిపోతారు? అన్న సందేహం రావొచ్చని.. వినియోగదారులు లాభపడి.. దేశం ముందుకు పోతున్నప్పుడు నష్టాలు భరించేందుకు కూడా ఆనందమేనని చెప్పారు.
మిత్రుడికి చురకలు అంటించిన ముకేశ్ మాటల్లో దిమ్మ తిరిగే వ్యాపార వ్యూహం ఉందని చెప్పాలి. ఎందుకంటే.. సునీల్ మిట్టల్ కోరినట్లుగా టెలికం రెగ్యులేటర్లకు ప్రభుత్వం వరాలు ప్రకటిస్తే దాని కారణంగా ఇబ్బంది పడేది జియోనే. ప్రభుత్వ వరాలతో నష్టాలు వస్తున్న టెలికం రెగ్యులేటర్లు ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం రావటం.. జియోకు మరింత పోటీని ఇవ్వటం ఖాయం. అదే ప్రభుత్వం నుంచి సాయం కోసం ఆధారపడకూడదని చెప్పటం ద్వారా మార్కెట్లో తన అధిపత్యం చెలాయిస్తూనే.. పోటీ సంస్థలకు చుక్కలు కనిపించేలా చేసే భారీ బిజినెస్ వ్యూహం ముకేశ్ మాటల్లో కొట్టొచ్చినట్లు కినిపించక మానదు. పైకి చూస్తే.. ఉన్నతంగా మాట్లాడినట్లు కనిపించినా.. వ్యాపార ప్రత్యర్థులు మునిగిపోయేలా మాట్లాడటంలో ముకేశ్‌కు మించినోళ్లు మరొకరు ఉండరని చెప్పక తప్పదు.