కరోనాతో అప్పుల పాలు కావద్దు: ఈటల హెచ్చరిక

Update: 2020-08-28 17:36 GMT
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు 2వేల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ వైద్యసేవల్లో ఫెయిల్ అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం లేక అందరూ ప్రైవేట్ ఆస్పత్రుల బారిన పడుతూ ఒళ్లు, ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కరోనా సోకిన వారు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు బాగున్నాయని.. ఇక్కడే వైద్యసేవలు పొందాలని ఆయన అన్నారు.

రూ.లక్ష ఖర్చు అయ్యే చోట ప్రైవేట్ ఆస్పత్రులు రూ.30లక్షల వరకు చార్జ్ చేస్తున్నాయని.. ఇది మంచిది కాదని ఈటల హితవు పలికారు. కరోనా సోకిన వారిని వెలివేయకండని.. కరోనా పోరులో అందరూ కలిసి రావాలని ఈటల కోరారు.
Tags:    

Similar News