వైసీపీలో ఎక్కడికక్కడ నేతల మధ్య విభేదాలు.. వివాదలు పెరుగుతున్నాయి. సరే.. పంపకాల్లో తేడాతోనో.. లేక.. పదవుల విషయంలో తేడాతోనో.. నాయకులు వివాదాలకు దిగుతున్నారు. సాధ్యమైనంత వరకు వా టిని జిల్లా స్థాయిలోనేసీనియర్ నాయకులు పరిష్కరిస్తున్నారు. అయితే..
అనంతపురం జిల్లా హిందూపు రం వైసీపీలో రగిలిన ఆధిపత్య కుంపటి మాత్రం నానాటికీ రగులుతూనే ఉంది. నాయకుల మధ్య సఖ్యత లేకపోగా.. ఒకరిపై ఒకరు వివాదాలు సృష్టించుకుని మరీ రోడ్డునపడుతున్నారు.
హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌ను అసమ్మతి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇక్బాల్ స్తానికుడు కాదని.. స్థానికులకే ఇనచార్జి పోస్టు ఇవ్వాలంటూ నాయకులు కొన్నాళ్లుగా రోడ్డున పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీతోపాటు అసమ్మతి వర్గంలోని ముఖ్యనాయకులైన రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన నవీన నిశ్చల్, వైసీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్తలు చౌళూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులకు అస్సలు పడడం లేదు.
గత ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు అధిష్టానం ఎమ్మెల్యే బీ-ఫారం ఇచ్చి, హిందూ పురం బరిలో నిలిపింది. ఆయన హిందూపురానికి వచ్చిన మొదటిరోజు నుంచే నవీననిశ్చల్ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఏడాది క్రితం ఎమ్మెల్సీపై నవీన వర్గీయులు పెద్దఎత్తున ధర్నాలు, నిరసనలు చేశారు. సీనియ ర్ నాయకులైన తమకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపించారు. తాజాగా మార్కెట్‌యార్డ్ చైర్మన్ కొండూరు మల్లికార్జున కూడా ఎమ్మెల్సీ వర్గం వీడి అసమ్మతి బాట పట్టారు.
దీంతో రానురాను అసమ్మతి వర్గం పెరిగిపోతుండటంతో నియోజకవర్గంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది కార్యకర్తల ఆవేదన. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఏదో ఒక చర్య తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని.. ఇక్కడి తటస్థ నాయకులు సీఎం జగన్‌కు విన్నవిస్తున్నారు.
ఇప్పటికే ఒకటి రెండు సార్లు హిందూ పురం పంచాయతీ తాడేపల్లి వరకు వచ్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో.. నాయకులు పదేపదే వీధిపడుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.