నోట్ల రద్దు ఎపిసోడ్ లో భాగంగా.. బ్యాంకుల్లో నగదు మార్పిడి కోసం వచ్చే వారిని సులువుగా గుర్తించేందుకు వీలుగా.. గడిచిన రెండు..మూడు రోజులుగా సిరా చుక్క వేసి పంపుతున్న విషయం తెలిసిందే. తమ డబ్బుల్ని మార్చుకోవటానికి వచ్చిన ప్రజలకు వారి డబ్బులు వారికే తిరిగి ఇస్తూ వేలికి సిరాగుర్తు వేస్తారా? మరీ ఇంతలా ప్రజల్నిఅవమానిస్తారా? అంటూ కేంద్రంపై పలువురు సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా సిరా చుక్క వేయటంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో నగదు మార్పిడికి వచ్చిన వారే పదే పదే వస్తున్నారన్న అంచనాతో.. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా సిరా చుక్కను వేయాలని కేంద్రం భావించింది. అయితే.. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మంచిది కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సిరా చుక్క వాడకంతో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని.. దీని కారణంగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయని.. అందుకే సిరాగుర్తు వాడకాన్ని నిలిపివేయాలంటూ ఈసీ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. ఈ మేరకు ఒక లేఖను రాసింది. వాస్తవానికి నగదు మార్చుకోవటానికి డబ్బులు తీసుకొచ్చే వారికి ఇలా సిరా చుక్క వేయటంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి డబ్బు వారికి తిరిగి ఇచ్చేయటానికి ఇలాంటివి ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తున్న వేళ.. ఈసీ లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/