అధికారం చేతిలో ఉండాలే కానీ.. అధినేతల కలలు.. కోరికలు వాస్తవ రూపం దాలుస్తుంటాయి. ఆ మధ్యన మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురై.. తాను చిన్నతనంలోడబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించిన విషయాన్ని.. రోడ్ల మీద వెళుతున్న వేళ వాటిని చూసిన వైనాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ పోస్టు పెట్టటం.. మళ్లీ హైదరాబాద్ రోడ్ల మీద వాటిని చూసే అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖామంత్రిని కోరటం తెలిసిందే. కేటీఆర్ లాంటి నేతకు నచ్చిన విషయం.. కచ్ఛితంగా మంత్రిగారికి కూడా నచ్చుతుంది కాబట్టి.. లాభనష్టాలతో సంబంధం లేకుండా డబుల్ డెక్కర్లను హైదరాబాద్ నగరంలో మరోసారి ప్రవేశ పెట్టేలా ప్రయత్నాలు షురూ అయ్యాయి.
అయితే..డబుల్ డెక్కర్ కారణంగా నష్టాలే తప్పించి లాభాలు ఎంతమాత్రం ఉండవని అధికారులు చెప్పటం.. ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ.. డబుల్ డెక్కర్ బస్సులతో మరింత నష్టమే తప్పించి లాభం ఉండదని తేల్చటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయిన్పటికీ మంత్రి కేటీఆర్ నోరు తెరిచి అడిగిన తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు తేకపోతే ఏం బాగుంటుందన్న ఉద్దేశంతో.. మహానగరంలోని పర్యాటక ప్రాంతాల్లో వాటిని ప్రత్యేకంగా తిప్పే ప్లాన్ ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు.
త్వరలో డబుల్ డెక్కర్ బస్సుల్ని హైదరాబాద్ రోడ్ల మీద తిప్పటమే లక్ష్యంగా పెట్టుకున్న వేళ.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరో కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్ కే కాదు చారిత్రక నగరమైన వరంగల్ లోనూ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలన్న కోరికను బయటపెట్టారు. హైదరాబాద్ తరహా వరంగల్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీసుల్ని మంజూరు చేయాలని ఆయన మంత్రి కేటీఆర్ కు విన్నవించుకోవటం ఈ ఎపిసోడ్ లో ఆసక్తికర అంశం.
కేటీఆరే.. డబుల్ డెక్కర్ బస్సులు తిప్పేందుకు అవకాశం ఉందా? అని రవాణా శాఖా మంత్రిని అడిగితే.. చీఫ్ విప్ మాత్రం ఏకంగా కేటీఆర్ కే అప్లికేషన్ పెట్టుకోవటం చూస్తుంటే.. డబుల్ డెక్కర్ తో మనసు దోచుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించక మానదు. హైదరాబాద్ కే అనవసరమని అధికారులు చెబుతున్న వేళ.. వరంగల్ కు అవసరమా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లేఖకు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.