ఎంతకూ కొరుకుడుపడని దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకను కాషాయ జెండా ఎగురవేసిన కమలనాథులు.. మిగిలిన రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో పాగా వేయటం ద్వారా.. తమ బలాన్ని మరింత విస్తరించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా.. తెలంగాణకు మించిన మరో అప్షన్ లభించని పరిస్థితి. దీంతో.. తెలంగాణను టార్గెట్ చేసిన కమలనాథులు.. తమ ప్లాన్ ను మరింత వేగంగా అమలు చేయటమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని మొన్నటివరకు వినిపించిన దానికి భిన్నంగా.. తాజాగా పెద్ద సారు మైండ్ సెట్ లో కాసిన్ని మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు.
అన్నింటికి సిద్ధంగా ఉండేందుకు డబుల్ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న బీజేపీ.. గులాబీ కారుకు పంక్చర్ వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. యూపీలో రెండోసారి అధికారాన్ని అందించిన డబుల్ ఇంజిన్ సర్కారు నినాదాన్ని తెలంగాణలోనూ ఈ మధ్యనే ఎక్కువగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రచారానికి మంత్రి కేటీఆర్ కాస్తంత ఘాటుగానే రియాక్టు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తమ అమ్ముల పొదిలో అస్త్రాలైన సీబీఐ.. ఈడీలతో అనుకున్న పనిని పూర్తి చేయాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాకులు ఇచ్చేందుకు వీలుగా కమలనాథులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండంచల విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి విడతలో ఒక మోస్తరు నేతల్ని ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. గులాబీ నేతల్లో బాగా వ్యాపారాలు చేసే వారికి సంబంధించిన డేటాను సేకరించి.. వారిని దారిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో అందరిని కాకున్నా.. కొందరికి పరోక్ష సంకేతాలు ఇప్పటికే వెళ్లినట్లు తెలుస్తోంది. తమ నినాదమైన డబుల్ ఇంజిన్ సర్కారును లోగుట్టుగా మాత్రం డబుల్ ఇంజిన్ అంటే సీబీఐ.. ఈడీను ప్రయోగించటమన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా..తెలంగాణకు చెందిన సంపన్న మంత్రి ఒకరికి అందిన సంకేతాలతో ఆయన పరుగు పరుగున ఢిల్లీకి వెళ్లి.. లోగుట్టుగా బీజేపీ అధినాయకత్వంతో సంధి చేసుకున్నట్లు చెబుతున్నారు. తాను ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేనని.. అవసరమైన తన నుంచి ఎలాంటి సహకారం ఇవ్వటానికి సిద్ధమన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను ‘డబుల్ ఇంజిన్’ను తన వ్యాపారాలకు తగిలించొద్దంటూ ప్రాధేయపడినట్లుగా చెబుతున్నారు.
ఇలా పలువురు టీఆర్ఎస్ నేతల్ని కమలనాథులు టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీఆర్ఎస్ అధినాయకత్వం విరుగుడు చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డెవలప్ మెంట్ కాదని.. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ.. ఈడీలతో దాడులు చేయించటమేనంటూ ఎదురుదాడికి దిగటం ద్వారా బీజేపీ దూకుడుకు కళ్లాలు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతల విషయంలో తాము అమలు చేసిన విధానాన్ని.. ఇప్పుడు బీజేపీ తమ పట్ల వ్యవహరిస్తుందన్న మాట టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏమైనా.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ మాట హాట్ టాపిక్ గా మారటం ఖాయమంటున్నారు.