తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చురుగ్గా పావులు కడుపుతున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ పైకి కాంగ్రెస్ - బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు తన లక్ష్యం అని, ఈ రెండు పార్టీలు కాకుండా..ప్రాంతీయ పార్టీల చేతిలో కేంద్రంలోని అధికారం ఉన్నట్లయితే... రాష్ట్రాలకు మంచి జరుగుతుందని పదేపదే చెబుతున్నారు. అయితే వాస్తవంలో కేసీ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ కి మేలు చేసే విధంగా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తోంది. సీపీఐ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ , కేసీ ఫ్రంట్ వలన బీజేపీ వ్యతిరేక ఓట్ చీలిపోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
పైగా కేసీఆర్ ఏ పార్టీలతో జట్టు కట్టే ఆలోచనతో ఉన్నారనే విషయం కూడా ఇలాంటి సందేహాలకు అవకాశం ఇస్తోంది. ఆల్రెడీ అతిభయాంకరమైన బీజేపీ వ్యతిరేకతతో చెలరేగుతున్న పార్టీలను మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి లోని కనీసం కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలను అయినా కేసీఆర్ ప్రభావితం చేయగలిగినప్పుడే... ఆయన వాదనలో సర్వ జనామోదయోగ్యమైన విషయం ఉన్నదని మనం అనుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు. ఈ లెక్కన కేసీఆర్ ప్రయత్నాల వలన భాజపాకు ఎలా నష్టం జరుగుతుంది..? అనే వాదన కూడా వినిపిస్తోంది.
మరొకవైపు కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడం కోసమే, జాతీయ రాజకీయాల పాట పాడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు వీహెచ్ లాంటి వారు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ తరహా ఆరోపణల్లో కొత్తదనం ఎంతమాత్రమూ లేదు.
పైగా కేసీఆర్ ప్రయత్నాలతో మరొక ప్రమాదం ఉన్నదని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే గియితే కేసీఆర్ చెబుతున్న కూటమి అధికారంలోకి రావాలి. అలా కాకుండా సీట్లు మాత్రం దక్కించుకుని కీలకంగా నిలిస్తే... అది ముక్కలు చెక్కలు అయిపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఎవరికి వారు కాంగ్రెస్ - భాజపా లలో ఒకరికి మద్దతు ఇవ్వడానికి విడివిడిగా బీరాలు మాట్లాడుకున్నా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. బహుశా... ఆ విధంగా బీజేపీ తో ఎన్నికల అనంతరం దోస్తీ కట్టే ఉద్దేశం ఉన్నది కనుకనే... కర్ణాటక లో దేవెగౌడ కూడా.. కేసీఆర్ ఆఫర్ ఇచ్చినా కూడా.. ప్రచారానికి ఆహ్వానించలేదనే వాదన కూడా ఉంది. ఏ రకంగా చూసినా కేసీఆర్ ఫ్రంట్ ప్రయత్నాల మీద పలువురిలో అనుమానాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.