నిజానికి జగన్ .. తాను పవన్ సూచన స్వీకరించి అవిశ్వాసం పెట్టడానికి సిద్ధం అని, తమకు బలం, లేదు మద్దతు కూడగట్టడానికి పవన్ తోడ్పడతారా అని మాత్రమే అన్నారు. అది ఒక వినతి- సవాలు కాదు. కానీ పవన్ దానిని సవాలు కింద భావించారు. ఆ సవాలును స్వీకరిస్తున్నా.. అంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు- మంచిదే. తాను సవాలును స్వీకరించి సంపూర్ణంగా మద్దతిస్తానన్నారు- సూపర్! ఢిల్లీ వచ్చి రాష్ట్రాలు తిరిగి అందరి మద్దతు కూడగడతా అన్నారు- ఇంకా సూపరు!! మినిమం మద్దతు అవసరమైన 50 ఖర్మమేమిటి కనీసం 80 మద్దతు తీసుకువస్తా అన్నారు- తిరుగులేని సూపరెహె!!! వీసమెత్తు క్రెడిట్ కూడా తనకు అక్కర్లేదని.. మొత్తం క్రెడిట్ జగన్ తీసుకోవచ్చునని సెలవిచ్చారు.. ఇది సూపర్ లో బంపర్ సూపర్ ఆఫరు!!!
కానీ కొంచెం తరచి చూస్తే పవన్ కల్యాణ్ మాటల్లో చాలా మడతపేచీలు కనిపిస్తున్నాయి. ఆయన చాలా తెలివిగా సవాలను స్వీకరిస్తున్నా అంటూనే కొన్ని మతలబులు పెడుతున్నారు.
1) మార్చి నెలాఖరులో తాము అవిశ్వాసం పెట్టడానికి రెడీ అని జగన్ అన్నారు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. అప్పటిదాకా కొన్ని రోజులైనా కేంద్రంపై పోరాడి తర్వాత తీర్మానం పెట్టాలనేది ఆయన ఆలోచన. కానీ పవన్ ఆ తేదీ సంగతి పట్టించుకోకుండా.. మార్చి 5 లోగా మాత్రమే ఎందుకు ప్రవేశపెట్టాలో కారణం చెప్పకుండా.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే, కనీసం మార్చి 4లోగా తీర్మానం పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. తేదీ మీద అంత స్పెసిఫిక్ పట్టింపు ఎందుకు? జగన్ ఆల్రెడీ చెప్పన తేదీని పవన్ ఎందుకు ఆమోదించలేకపోతున్నారు. అంతా, ప్రతి అడుగూ తాను చెప్పినట్లే వేయాలనే దురహంకారం ఆయనను అలా మాట్లాడిస్తోందా? లేకపోతే కొత్తతేదీకి రీజనేంటి? చెప్పాలికద!
2) జగన్ ఆరోపించినట్లు తాను తెలుగుదేశానికి పార్టనర్ ను కాను అంటున్నారు. సరే మంచిదే అలాగే అనుకుందాం. మరి కాకపోతే.. జగన్ అవిశ్వాసం పెట్టకపోతే.. తెలుగుదేశానికి ఓ మంచి ఛాన్స్ ఉంటుంది.. వారు పెట్టవచ్చు అనే బదులు... జగన్ మీద స్పందించినట్లే.. దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టవచ్చు అనవచ్చుగా.. పాపం అలా అనడానికి పవన్ కు నోరు ఆడడం లేదేమో!