251 ఫోన్... నిజమా? అబద్ధమా?

Update: 2016-02-18 17:30 GMT
    భారీ అంచనాలతో, ఎన్నో ఆశలు, ఊహలకు కేంద్రమవుతూ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎంటరైన ఫ్రీడమ్ 251 ఫోన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో జోకర్ గా మారిపోయింది. నిన్న, ఈ రోజు ఉదయం 10 గంటల వరకు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఉన్న ఈ ఫోన్ ఆ తరువాత వెటకారాలకు, అనుమానాలకు, సందేహాలకు, నవ్వులకు, ఎగతాళికి అన్నిటికీ ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఫ్రీడమ్ 251పై వచ్చిన జోకులు - నెటిజన్లు పేల్చిన సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.

ఉదయం నుంచి ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ కాలేదని... ఒక్కరు కూడా తాము ఆర్డర్ చేసినట్లుగా చెప్పలేదని అంటున్నారు. నెట్ లో ఆర్డర్ చేసినట్లు ఒక్కరు కూడా ఆధారం చూపలేదు. అయితే.. అంతలోనే ఆ సంస్థ ఆర్డర్లు తీసుకోవడాన్ని వాయిదా వేసింది. దీంతో ఫేస్ బుక్ - ట్విట్లర్లలో నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేశారు. అసలు ఇది నిజమా... బోగసా అన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు... ఈ కంపెనీ మిగతా మోడల్స్ కు ప్రచారంగా ఈ ఎత్తుగడ వేశారని చెబుతున్నారు.

కొందరు మాత్రం ఫోన్ బుక్కయితే లాభమేనని... అది పనిచేయకపోయినా ఛార్జర్ - ఇయర్ ఫోన్లు మిగులుతాయని అంటూ జోకులేస్తున్నారు. ఇంకొందరైతే... నేను ఒక ఇరవై ఫోన్లు కొని బ్లాక్ లో అమ్మాలనుకున్నాను.. కానీ, కుదర్లే అంటూ వెటకారాలు చేశారు. మేకిన్ ఇండియా పరువు తీశారంటూ మరికొందరు మండిపడ్డారు. మొత్తానికి ఇలా ఫ్రీడమ్ 251 నిజమా? అబద్ధామా? అన్నది తేలక నెటిజన్లు చర్చోపచర్చలు జరిపారు.
Tags:    

Similar News