దివికేగిన సుందరి శ్రీదేవి కేసు ముగిసింది. అయితే సందేహాలు మాత్రం అలాగే మిగిలాయి. అందాలరాశి అచేతన స్థితిలో మృతి చెందిన రెండున్నర రోజుల ఉత్కంఠ తర్వాత మొత్తానికి శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు మూసేశారు . సుమారు 60 గంటలపాటు తీవ్ర హైడ్రామా - ఎన్నో మలుపుల మధ్య విచారణ సాగింది. ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా నిర్ధారిస్తూ కేసును మూసివేస్తున్నామని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. అయితే ఇప్పటికీ ప్రజల్లో - మీడియాలో వ్యక్తమవుతున్న అనేక ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరుకలేదు.
ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
- స్పృహతప్పిన స్థితిలో శ్రీదేవిని చూసి - బోనీ కపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన సమయంలో ఏం జరిగింది?
- శ్రీదేవి కచ్చితంగా ఎన్ని గంటలకు మరణించారు?
- లోపలివైపు గడియ పెట్టి ఉన్న బాత్‌రూం తలుపులను బోనీ ఎలా తెరువగలిగారు?
- పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. నిండా నీరు ఉన్న బాత్ టబ్ లో శ్రీదేవి మృతదేహం కనిపించిందని గల్ఫ్ న్యూస్ పత్రిక తెలిపింది. డెత్ సర్టిఫికెట్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు రాసి ఉంది. మరి బాత్ రూంలోకి శ్రీదేవి వెళ్లకముందు టబ్ లో నీళ్లు ఎవరు నింపారు?
- స్పృహ కోల్పోయిన స్థితిలో ఆమె టబ్ లో కుప్పకూలిపోయి ఉంటే.. కచ్చితంగా తలపై - శరీరంపై గాయాలు - గుర్తులు కనిపించాలి. మరి అవి ఉన్నాయా?
- దుబాయ్ లో తన మేనల్లుడి వివాహం జరిగిన వెంటనే బోనీకపూర్ కూతురిని తీసుకుని ముంబయికి ఎందుకు వచ్చారు? మళ్లీ ఒక్కరోజులోనే శ్రీదేవిని ఆశ్చర్యపరచడానికి ఎందుకు వెళ్లారు?
- మద్యం ఆనవాళ్లున్నాయని అన్నప్పుడు - ఎంత తాగితే - తన మీద తాను నియంత్రణ కోల్పోయి టబ్ లో పడిపోయే పరిస్థితి ఉంటుంది? శ్రీదేవి కుటుంబ సన్నిహితుడు అమర్ సింగ్ - బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చెప్పినదాని ప్రకారం - అమెకు మద్యం సేవించే అలవాటు లేదు. ఎప్పుడైనా కొద్దిమోతాదులో వైన్ గానీ - బీర్ గానీ సేవించేవారు. మరి అలాంటప్పుడు ఇదెలా సాధ్యం?
- బాత్‌రూంలో శ్రీదేవి పడిపోయి ఉండటాన్ని మొదట చూసింది బోనీకపూర్ అంటున్నారు. మరి బోనీ వెంటనే హోటల్లో ఉండే ఎమర్జెన్సీ డాక్టరకు ఫోన్ చేయకుండా తన స్నేహితుడికి ఎందుకు ఫోన్ చేశారు?