కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ పై సాగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న మొదలైన ఐటీ సోదాల కారణంగా పరమేశ్వర్ కాస్తంత ఒత్తిడికి గురైనా... ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) రమేశ్ మాత్రం తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. కన్నడనాట చోటుచేసుకున్న ఈ పరిణామం... ఐటీ దాడులపై సరికొత్త వాదనలు వినిపించేలా చేసిందని చెప్పక తప్పదు. ఇటీవలే వేల కోట్లు సంపాదించడమే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కదా. సిద్దార్థ కూడా ఐటీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని నాడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలు నిజమన్నట్లుగా ఇప్పుడు పరమేశ్వర్ పీఏ రమేశ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీ వేధింపుల కారణంగా కన్నడనాట వరుసగా రెండు ఆత్మహత్యలు చోటుచేసుకోవడం నిజంగానే కలకలంగా మారిందని చెప్పక తప్పదు.
రెండు రోజుల క్రితం మొదలైన ఐటీ సోదాలు పరమేశ్వర్ నివాసంతో పాటు అయనకు చెందిన సిద్దార్థ మెడికల్ కళాశాల, విద్యాసంస్థలపై సాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ అధికారులు తొలిరోజునే పరమేశ్వర్ పీఎ రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణ అనంతరం శనివారం ఉదయం 6 గంటలకు రమేష్‌ను ఐటీ అధికారులు వదిలిపెట్టారు. అక్కడి నుంచి బయటపడ్డ రమేష్ నేరుగా జ్ఞానభారతి పరిధిలోని క్రీడామైదానానికి చేరుకున్నాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐటీ దాడులకు భయపడి పరువు కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. రామనగర్ జిల్లా మల్లేహళ్ళి గ్రామానికి చెందిన రమేష్ సుధీర్ఘ కాలంగా కేపీసీసీలో టైపిస్టుగా పనిచేశాడు. పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక పీఏగా చేరాడు. ఆత్మహత్యకు ముందు రమేష్ పలువురు సన్నిహితులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. నాడు కాఫీడే సిద్ధార్థ మాదిరే రమేశ్ కూడా ఐటీ వేధింపులపై తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా తన సన్నిహితులకు ఫోన్లు చేసిన రమేశ్ ఏమన్నాడన్న విషయానికి వస్తే.. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కోవడం తనకు సాధ్యం కావడం లేదని, అధికారులు ఇష్టారాజ్యంగా ప్రశ్నలు వేస్తున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడట. ‘నేను ఎంతో నిజాయితీతో బతికాను. అన్యాయంగా నా ఇంటిపైనా ఐటీ దాడులు సాగాయి. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో నన్ను ప్రశ్నిస్తున్నారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితి లేకుండా పోతోంది. వాళ్లు ఏం అడుగుతారోననే భయం వెంటాడుతోంది. నాకు బతికేందుకు సాధ్యం కావడం లేదు’ అంటూ రమేశ్ తన గోడును వెల్లడించాడట. ఈ ఫోన్ సంభాషణ ముగిసిన కాసేపటికే రమేశ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు మిత్రులు గుర్తించారు. రమేష్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు మిత్రులు గాలించే యత్నం చేశారు. అయితే ఇంతలో జ్ఞానభారతి మైదానంలో చెట్టుకు ఓ వ్యక్తి వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు రమేశ్ గా గుర్తించారు. ఈమేరకు జ్ఞానభారతి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.