చైనాను గజగజలాడిస్తూ.. ప్రపంచ దేశాలకు కొత్త భయంగా మారి.. కిందా మీదా పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసురుతోంది ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్. చైనాను చుట్టేస్తున్న ఈ వేరియంట్ కారణంగా భారత్ కు ముప్పు ఉంటుందని.. మరో భారీ వేవ్ కు అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. మన పరిస్థితి ఏమిటి? మనమెంత ప్రభావితం అవుతాం? నిజంగానే బీఎఫ్ 7 ప్రమాదకారా? దాని వల్ల పొంచి ఉన్న డేంజర్ ఎంత? అసలు భారత్ లోకి అదెప్పుడు వచ్చింది? దాన్ని ఎప్పుడు గుర్తించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు.. దానిపై ఇప్పటికే కీలకమైన అధ్యయనం చేసిన వైనాన్ని వెల్లడించారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కమ్ ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక విషయాల్ని వెల్లడించారు. ప్రస్తుతం అందరిలోనూ ఆదుర్దాను పెంచుతున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన బీఎఫ్ 7 మన దేశంలో అక్టోబరులోనే ప్రవేశించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. కేసులు చాలా తక్కువగా వచ్చినట్లుగా నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ మాదిరి ఇది ప్రమాదకారి కాదని స్పష్టం చేశారు. తాము చేసిన అధ్యయనాన్ని.. ఆ సందర్భంగా తాము గుర్తించిన పలు విషయాల్ని ఆయన వెల్లడించారు. తాజా వేరియంట్ గురించి తాము చేసిన అధ్యయనం గురించి వెల్లడించిన ఆయన ఏం చెప్పారు? కీలక పాయింట్లు ఏమంటే?
- ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్లు ఒకరి నుంచి ఐదుగురికి వ్యాపిస్తే.. తాజా వేరియంట్ (బీఎఫ్ 7) మాత్రం ఒకరి నుంచి పది మంది వరకు సోకే వీలుంది
- ఊపిరితిత్తుల వరకు ఈ వేరియంట్ వ్యాపించే గుణం లేదు. గొంతు వరకు మాత్రమే పరిమితం అవుతుంది.
- పెద్ద వయస్కులు.. గుండె జబ్బు.. కేన్సర్.. షుగర్ ఉన్న వారితో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి
- దేశంలో 28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోసులు వేసుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వేసుకోవాలి
- బూస్టర్ గా కొర్బెవాక్స్ వేసుకుంటే కొవిడ్ కు పూర్తి స్థాయిలో చెక్ పడే వీలుంది. దీనిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించాం.
- మేం చెప్పిన విషయం హై ఇంపాక్ట్ ఫ్యాక్టరీ జర్నల్ వ్యాక్సిన్ లో ప్రచురితమైంది
- చైనా.. జపాన్.. దక్షిణ కొరియా.. అమెరికా.. బ్రెజిల్ లో బీఎఫ్ 7 కేసులు భారీగా వస్తున్నాయి.
- ఆయా దేశాల్లో కేసులు పెరగటం వల్ల మన దేశంలోనే ఆందోళన మొదలైంది. మన దగ్గర మాదిరి చైనాలో పంపిణీ చేసిన వ్యాక్సిన్ లో నాణ్యత లేదు. పూర్తిస్థాయి పంపిణీ జరిగింది లేదు.
- భారత్ లో రెండు డోసులు పూర్తిస్థాయిలో పంపిణీ పూర్తైంది. దీని కారణంగా ఎన్ని వేరియంట్లు వచ్చినా తట్టుకునే శక్తి మన దగ్గర ఉంది.
- బీఎఫ్ 7పెరుగుదల ఎంత ఎక్కువగా ఉంటుందో.. తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుంది
- దేశంలో దీని వ్యాప్తి మొదలైతే ఫిబ్రవరిలో గరిష్ఠానికి చేరి.. మార్చిలో తగ్గిపోతుంది.
- రద్దీ ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకపోవటం.. భౌతిక దూరం పాటించటం.. మాస్కులు ధరించటం లాంటి వాటితో అడ్డుకట్ట వేయొచ్చు.
- ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. బూస్టర్ డోస్ గా కొర్బెవ్యాక్స్ మెరుగైన ఫలితాల్ని ఇస్తోంది.
- ఈ వ్యాక్సిన్ వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేలా శరీరంలో రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- కొవిషీల్డ్ వేసుకున్న వారికి కొర్బెవ్యాక్స్ బూస్టర్ డోస్ గా వేసుకోవచ్చు. అదెలాపని చేస్తుందన్నది డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో మా టీం అధ్యయనం చేసింది.
- ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒళ్లు నొప్పులు.. అలర్జీ.. జ్వరం లాంటివి ఏమీ కలుగలేదు.
- ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొద్ది మందికి మాత్రమే దుష్ఫలితాలు కనిపించాయి. వ్యాక్సిన్ వేసిన 30-90 రోజుల మధ్య యాంటీబాడీసీ బాగా పెరిగినట్లుగా గుర్తించాం.
- ఈ వ్యాక్సిన్ ఎఫెక్టు ఏడాది పాటు ఉంటుంది. కొవిడ్ కు చెక్ పెట్టానికి మూడేళ్ల పాటు వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.