భారత్ కి పాకిస్థాన్ కంటే కూడా చైనాతో ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. గత కొన్నాళ్లుగా చైనా భారత్ పట్ల వ్యవహరిస్తున్న వైఖరే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. అరుణచల్ ప్రదేశ్లోకి చైనా బలగాలు దూసుకురావడం.. గాల్వన్.. తదితర సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిత్యం కవ్వింపులకు పాల్పడుతుండటం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి.
గాల్వన్ ఘటన తర్వాత చైనాతో భారత్ సంబంధాలు బీటలు వారాయి. ఇరుదేశాల సరిహద్దులో నిత్యం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుదేశాలు సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. భారత్ మాత్రం చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుందని చెబుతుండగా చైనా మాత్రం కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.
డ్రాగన్ కంట్రీ వంకర బుద్దిని నిశితంగా గమనిస్తున్న భారత్ అవసరమైతే చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు చైనా మాత్రం సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడటమే కాకుండా యుద్ధానికి సన్నహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
చైనా ఆర్మీని ఉద్దేశిస్తూ 'యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?' అని ప్రశ్నించారు. ఇదే విషయంపై చైనా మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తూ కథనాలు వెలువరించడం చర్చనీయాంశంగా మారింది. సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జిన్ పింగ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. చైనా ఆర్మీకి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైనా ఆర్మీ సరిహద్దు ప్రాంతాన్ని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నామని వెల్లడించారు. సరిహద్దుల్లో అత్యంత క్లిష్టమైన వాతావరణంలో ఆర్మీ జవాన్లు అందిస్తున్న సేవలను జిన్ పింగ్ అభినందించారు. సైనికుల ఆహార పదార్థాలు సరిగ్గా అందుతున్నాయో లేదో వాకబు చేశారు. సైనికులను సరిహద్దు రక్షకులుగా అభివర్ణించిన జిన్ పింగ్ వారిలో నూతనోత్తేజం కలిగేలా మాట్లాడినట్లు చైనా మీడియా పేర్కొంది.
కాగా 2020 మే 5 లద్దాఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద హింసాత్మక ఘటన తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే సరిహద్దు విషయంలో ఇరుదేశాల మధ్య ఇప్పటికే 17 సార్లు చర్చలు జరిగగా ఎటువంటి ఫలితం లేకుండా పోయాయి. సరిహద్దుల్లో మునుపటి పరిస్థితి కొనసాగించేలా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నప్పటికీ చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతోంది. దీంతో ప్రత్యర్థులకు ధీటుగా భారత్ సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.