నేటి నుండి అందుబాటులోకి డీఆర్డీవో 2డీజీ డ్రగ్ !

Update: 2021-05-17 04:21 GMT
డీఆర్‌ డీవో అభివృద్ధి చేసిన కరోనా వైరస్ మహమ్మారి  ఔషధం  2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఈ రోజు  అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం పది వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల, వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌ డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. ఈ రోజు (సోమవారం) రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఈ డోసులను పంపిణీ చేయనున్నారు. మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు.  

దీన్ని కరోనా వైరస్  రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడుకోవచ్చు అని , భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌ డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌  ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌ డీవో తెలిపింది.  క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఇప్ప‌టికే డీఆర్డీవో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాపై భార‌త్ చేస్తున్న పోరాటంలో ఈ -డీజీ డ్ర‌గ్ కూడా కీల‌క భూమికి పోషించ‌నుంది.
Tags:    

Similar News