రేప్ ల‌కు అది కార‌ణం కాదు: నిర్మ‌ల సీతారామ‌న్‌

Update: 2018-05-08 13:44 GMT
జ‌మ్మూ క‌శ్మీర్ లోని క‌థువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా గ్యాంగ్ రేప్ - హ‌త్యోదంతం మొద‌లు....నిన్న గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో తొమ్మిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. 12 ఏళ్ల లోపు చిన్నారుల‌పై అత్యాచారం చేసిన వారికి మ‌ర‌ణ‌శిక్ష విధించడం, మ‌హిళ‌ల‌పై అత్యాచారం చేసేవారికి ప‌దేళ్ల‌పాటు శిక్ష‌ను విధించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తే కేంద్రం ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే, ఇంత జ‌రుగుతున్నా...మ‌హిళ‌లైన కేంద్ర‌మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్ - స్మృతీ ఇరానీతో స‌హా మ‌రికొంద‌రు స్పందించ‌లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్పందిచారు. అత్యాచారం చేసేవారిని క‌ఠినంగా శిక్షించాల‌ని చెప్ప‌డం మానేసి.....మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ వ‌ల్లే అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌ని కొంద‌రు చెప్ప‌డం హాస్యాస్ప‌దమ‌ని ఆమె అన్నారు. ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ వ‌ల్లే అత్యాచారాలు పెరిగిపోయాయ‌ని కొంద‌రు చేసిన కామెంట్ల‌పై నిర్మ‌లా సీతారామ‌న్ స్పందించారు. ఆ ర‌క‌మైన కుచింత‌త మ‌న‌స్త‌త్వం నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డాల‌ని, ప్ర‌జ‌ల‌ ఆలోచనా ధోరణి మారాలని ఆమె పిలుపునిచ్చారు. మ‌హిళలు ధరించే వస్త్రాల వ‌ల్లే అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌న‌డం స‌రికాద‌న్నారు. వ‌స్త్ర‌ధార‌ణే కార‌ణ‌మైతే...8 నెల‌ల ప‌సిపాప మొద‌లు...60 ఏళ్ల  వృద్ధ మహిళల వ‌ర‌కు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. చాలా సంద‌ర్భాల్లో మహిళలకు తెలిసిన వారే లైంగిక వేధింపులు, అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. బంధువులు - స్నేహితులు - పొరుగువారు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో న్యాయ వ్యవస్థ మరింత చురుగ్గా వ్యవహరించాల‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News