కొత్త నిర‌స‌నః నీళ్ల‌కు బ‌దులు బీర్లు తాగ‌లేం

Update: 2016-04-18 17:11 GMT
దేశంలోని క‌రువు ప‌రిస్థితికి అద్దం ప‌డేందుకు మ‌హారాష్ట్రలోని క‌రువే అద్దం ప‌డుతోంది. రైళ్ల‌లో నీళ్లు త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి. అయితే ఈ ప‌రిస్థితిని మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ ఎద్దేవా చేసింది. నీళ్లకు బదులుగా బీర్లు తాగడం మా సంస్కృతి కాదని శివసేన స్పష్టం చేసింది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలు తాగునీటి బాటిళ్లను కొనలేని స్థితిలో ఉన్నారని ఆ పార్టీ అభిప్రాయపడింది. మరట్వాడాలోని కరువు బాధిత ప్రాంతాల్లో ఉన్న మద్యం ఉత్పత్తి కంపెనీలకు నీటి సరఫరాను నిలిపేయాలని రెండు రోజుల క్రితం శివ సేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో ఈ వ్యాఖ్యలు చేస్తూ కథనాన్ని రాశారు. ఔరంగాబాద్ సమీపంలో సుమారు 10 బీరు ఉత్పత్తి కంపెనీలున్నాయి. కరువు పరిస్థితుల దృష్ట్యా ఆ కంపెనీలకు 20 శాతం నీటి సరఫరాను నిలిపేశారు. అయితే ఆ పరిశ్రమల మీద వేలాది మంది ఆధారపడ్డారు కనుక వాటిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని శివసేన కోరింది. కేవలం మనుషుల ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే నీటిని వినియోగించాలన్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సామ్నా పత్రికలో శివసేన పేర్కొంది.
Tags:    

Similar News