ట్రైనొస్తేనే అక్కడ నీరు

Update: 2016-04-11 09:13 GMT
నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.  నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు రైళ్లలో నీటిని పంపించాలని ప్లాన్ చేశారు. లాతూర్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఇలా నీటిని సోమవారం పంపించారు. 50 వ్యాగన్లలో నీరు నింపి లాతూరుకు పంపించడంతో అక్కడ తాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని భావిస్తున్నారు.  2.75 లక్షల లీటర్ల నీటిని, కరువుని ఎదుర్కొంటున్న మరట్వాడా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంతవరకు ట్రైన్లలో నీటి కోసం ప్రత్యేకంగా వ్యాగన్లు లేకపోవడంతో ఇంధనం - నూనెలను చేరవేసే వ్యాగన్లను ఆవిరితో శుభ్రం చేసి వాటిలోనే నీటిని పంపుతున్నారు.
   
మరట్వాడా ప్రాంతాల్లో డ్యాములు ఎండిపోయి జనం నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10-12 రోజులు ఒకసారి అక్కడి ప్రజలకు మంచినీరు అందుతోంది. అందుకే  ప్రభుత్వ యంత్రాంగం రైలు ద్వారా  నీటిని అందించాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతానికి చెందిన సాంగ్లి జిల్లా అధికారులు ఇందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.  2,700 మీటర్ల నీటి సరఫరా లైనును లైనుని నిర్మించి, రైల్యే ఫిల్టర్ హౌస్ నుండి రేల్వే యార్టుకి నీటిని తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులకు మొత్తం రూ . 1.84 కోట్లు ఖర్చుకానుంది.   ప్రస్తుతం ట్రయిల్ రన్ గా వ్యాగన్లలో  నీటిని నింపి పంపుతున్నా... వారం రోజుల్లో ప్రత్యేక లైన్లలో క్రమం తప్పకుండా మరట్వాడా కరువు జిల్లాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News