విశాఖ‌లో మత్తు ఇంజెక్ష‌న్ల దందా..

Update: 2022-05-09 10:42 GMT
రాష్ట్రాన్ని 'మ‌త్తు' వీడ‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గంజాయి  సంచ‌ల‌నం రేప‌గా.. త‌ర్వాత‌.. ఏకంగా గుజ‌రాత్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. ఇక‌, ఇప్పుడు మత్తు ఇంజెక్ష‌న్లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఏదైనా కూడా యువ‌తే ల‌క్ష్యంగా.. ఇవి జోరందుకోవ‌డం గ‌మ‌నార్హం.

విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పశ్చిమబంగెల్‌ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిఘా పెట్టిన వారు.. ముగ్గురు నిందితలను అరెస్టు చేశారు.

శస్త్రచికిత్సల్లో నొప్పిని నివారించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న నిందితులను.. విశాఖ టాస్కుఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 వేల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఖరగ్పూర్‌లో ఒక బాక్సు ఇంజెక్షన్లు రూ.1300కు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో రూ.2వేలకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

విశాఖలో విద్యార్థులు, యువత మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల దందా సాగుతోందని.. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు.

పశ్చిమబెంగాల్ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి లీలామహల్ జంక్షన్లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టినట్లు చెప్పారు.

పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన అనుపమ అధికారి, కౌశిక్ చౌధురి అనే ఇద్దరితోపాటు.. భీమిలిలో ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 3 వేల ఇంజెక్షన్లు, రూ.వెయ్యి నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Tags:    

Similar News