డ్రగ్ రాకెట్ వ్యవహారం తెలుగురాష్ట్రాలను కుదిపేస్తోంది. సినీ ఇండస్ట్రీలో సంచలనాలను నమోదు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ద్వారా దొరికిన ఆధారాలతో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తుండడం.. వ్యవహారం అంతా పబ్ లు కేంద్రబిందువుగా నడుస్తున్నట్లు సమాచారం తెలుస్తుండడం.. వాటి మీద విచారణ ఇలా.. ఓ యాక్షన్ మసాలా సినిమా సీన్ ల మాదిరిగానే డ్రగ్ రాకెట్ విచారణ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే.. ఇప్పుడే తాజాగా విలన్ ఎంట్రీ ఇవ్వడం మొదలైంది. ఏదో అల్లాటప్పాగా కాదు.. అచ్చంగా సినిమాలో సీన్ ను తలపించేలాగా.. డ్రగ్ విచారణకు సారథ్యం వహిస్తున్న ఒక ఉన్నతాధికారికి వరుసగా మూడుసార్లు ఫోను చేసి.. ‘‘మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో కూడా మాకు తెలుసు! ఇంకా ముందుకెళితే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’’ అని మాఫియా హెచ్చరించినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కెల్విన్ పట్టుబడినందుకు అంతర్జాతీయ స్థాయిలోని డ్రగ్ మాఫియా డైరక్టుగా రంగంలోకి దిగిందంటే.. ఈ పెడ్లర్ ల సంబంధాలు ఎంత లోతుగా ఉన్నయో అర్థం అవుతోంది. పైగా ఈ ఉన్నతాధికారికి వచ్చిన ఫోన్ ఇంటర్నెట్ ను వినియోగించే వాయిస్ ప్రోటోకాల్ (విఒఐపి) ద్వారా వచ్చినట్లు గుర్తించారే తప్ప.. ఫోను చేసిన వారెవ్వరు, ఎక్కడినుంచి చేశారు అనేది వారం రోజులుగా పోలీసులు ట్రేస్ చేయలేపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి డ్రగ్ రాకెట్ ను ఛేదించడాన్ని ఇక్కడి పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లే, పోలీసులతో పరస్పరం తలపడడానికి డ్రగ్ మాఫియా కూడా అదే స్థాయిలో సీరియస్ గా డిసైడైనట్లే ఉంది. అందుకే ఇలాంటి సినిమాటిక్ సీన్లు చోటుచేసుకుంటున్నాయి.
నిజానికి డ్రగ్ వ్యవహారంలో వాడిన వారు బాధితులుగా, అమ్మిన వారు పెడ్లర్ లుగా శిక్షలు అనుభవించాలి. ఆ లెక్కన ప్రస్తుతానికి డ్రగ్స్ విక్రయించే వ్యక్తిగా కెల్విన్ పెద్ద నేరం చేసినట్టు, ప్రధాన విలన్ కింద లెక్క. ఇప్పటిదాకా నిగ్గుతేలిన వివరాల ప్రకారం విలన్ కెల్వినే. అయితే తాజాగా వస్తున్న వార్తలను గమనిస్తే కెల్విన్ చిన్న విలన్ అని, విదేశాల నుంచి ఇతణ్ని నడిపించే మెయిన్ విలన్ మరొకరు ఉన్నారని అర్థమవుతోంది. ఆ మెయిన్ విలన్లు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. కేవలం విచారణల పర్వంలోనే ప్రకంపనాలు పుట్టిస్తున్న ఈ డ్రగ్ రాకెట్ కేసుల్లో ముందు ముందు మరిన్ని సంచలనాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.