90ల్లో అటు బాలీవుడ్ లో.. ఇటు సౌత్ సినిమాల్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన హాట్ హీరోయిన్ మమతా కులకర్ణి డ్రగ్స్ రాకెట్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే ఆరోపణపై విచారణ జరుపుతున్నారు. థానె పోలీసులు ఇటీవలే 20 టన్నుల నిషేధిత డ్రగ్స్ ను సీజన్ చేశారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ లో మమతా కులకర్ణి భర్త విక్కీ గోస్వామి కీలక పాత్ర పోషించాడని.. ఇందులో మమత ప్రమేయం కూడా ఉందని పోలీసులు అంటున్నారు.
1997లోనే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విక్కీ 15 ఏళ్ల పాటు జైల్లో గడపడం గమనార్హం. జైలు నుంచి బయటికి వచ్చాక భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబికి మకాం మార్చాడు విక్కీ. కానీ ఒకసారి డ్రగ్స్ రాకెట్లో వేలు పెట్టాక ఆ బుద్ధులు ఎక్కడికిపోతాయి చెప్పండి. నైరోబి నుంచే విక్కీ తన కార్యకలాపాలు కొనసాగించాడు. విక్కీ కార్యకలాపలపై కన్నేసిన అమెరికా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు థానె పోలీసులు కూడా అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చారు.
ఇటీవలే పట్టుబడిన 20 టన్నుల డ్రగ్స్ కు సంబంధించి సూత్రధారి విక్కీనే అని.. ఇందులో మమత పాత్ర కూడా ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు థానె పోలీసులు. తనపై ఇంటర్ పోల్ నోటీసు ఉండడంతో దుబాయ్ - సింగపూర్ - దక్షిణాఫ్రికా - అమెరికాల్లో డ్రగ్స్ కార్యకలాపాలు చూసే బాధ్యతను విక్కీ మమతకే అప్పగించాడని సమాచారం. మహారాష్ట్రలోనూ ఆమె డగ్స్ నెట్ వర్క్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలన్నీ మమత పేరు మీదే నడుస్తున్నాయని.. హవాలా మార్గంలోనూ లావాదేవీలు సాగిస్తున్నారని తెలుస్తోంది.