టీడీపీ ఎమ్మెల్యేల‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

Update: 2022-03-23 17:30 GMT
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాట్లాడుతూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.. టీడీపీ సభ్యులు కేవలం లోపలికి వచ్చి కావాలని సస్పెండ్ చేయించుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారని విమర్శించారు. చిడతలు కొడుతున్న వారందరిని డ్రంకెన్ టెస్ట్ చేయించాలని కోరుతున్నామన్నారు. హోం మినిష్టర్‌గా పనిచేసిన చినరాజప్ప సారాపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్నారు. ఆయనకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడత భజన కాదని.. బడిత పూజ చేయాలని.. అప్పడే బుద్ధి వస్తుందని రాజా పేర్కొన్నారు.

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని విమ‌ర్శించారు. 240 బ్రాండ్స్‌కు పర్మిషన్‌ ఇచ్చింది చంద్రబాబు కాదా? అని ప్ర‌శ్నించారు.. చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టం అని అన్నారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారని అన్నారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

ఇక‌, అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చిడ‌త‌లే మిగుల్చుతార‌ని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడంపై   స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని అన్నారు.

నిన్న విజిల్స్‌ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు రేపు సభలో ఏం చేస్తారో..?. సభలో అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్‌ చేయాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు.  

మ‌రో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. సభకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. సభా సమయం వృథా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రోజుకు 20 ల‌క్ష‌ల రూపాయ‌లు వ్య‌యం అవుతున్న అసెంబ్లీలో ప్ర‌తి నిముషం కూడాఅత్యంత విలువ‌న‌దేన‌ని ఆయ‌న చెప్పారు.
Tags:    

Similar News