మన తెలుగు హీరోలు ఆ ఊ అంటే తమ సినిమాల్లో సింహం.. పులి.. రెఫరెన్సులు తెస్తుంటారు. పవన్ కళ్యాణేమో సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటా అంతే తేడా అంటాడు. బాలయ్య తన సినిమాల పేర్లలో సింహం వచ్చేలా చూసుకుంటూ ఉంటాడు. ఎన్టీఆర్ కు యంగ్ టైగర్ అని బిరుదిచ్చేశారు. మరి ఆ రెఫరెన్సులు చూసి చూసి ఆ వ్యక్తి ఈ సింహాలు పులులు.. తెలుగు హీరోలకు చాలా క్లోజ్ అనుకున్నాడో ఏమో నేరుగా వెళ్లి వాటితో షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అదృష్టవశాత్తూ జూ సిబ్బంది వెంటనే స్పందించబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే షేక్ హ్యాండ్ కోసం అతను చాచిన చెయ్యితో పాటు అతను కూడా మిగిలేవాడు కాదు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ చిత్రం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్న జూలో ఒక్కసారిగా కలకలం రేగింది. మద్యం మత్తులో ముఖేష్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకేశాడు. సెక్యూరిటీ కళ్లుగప్పి ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించిన అతను సింహంతో షేక్ హ్యాండ్ ఇద్దామని ఆ పని చేయడం విశేషం. ముందు అతను ఎన్ క్లోజర్లోకి దూకబోతుంటే ఒక సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. కానీ ఆ గార్డు పక్కకు వెళ్లాక అతడి కళ్లుగప్పి అతను లోపలికి దూకేశాడు. మధ్యలో ఉండే నీటి మడుగులో ఈదుతూ సింహాలున్నవైపు వెళ్లి వాటికి హాయ్ చెప్పడం విశేషం.
అతణ్ని చూసి ఓ సింహం వెనకడుగు వేయగా.. మరో సింహం అతడిపై దాడికి సిద్ధమైంది. ఐతే ఇదంతా చూస్తున్న జనాలు పెద్ద పెట్టున అరవడంతో జూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సింహాల దృష్టి మళ్లించి ఎన్ క్లోజర్ గేట్ లోపలికి తీసుకెళ్లిపోయారు. తర్వాత ఓ పొడవాటి చెక్కను ఎన్ క్లోజర్ పై నుంచి కిందికి పెట్టి.. దాని మీది నుంచి ముఖేష్ ను నడుచుకుంటూ తీసుకొచ్చారు. ముఖేష్ ను బహదూర్ పురా పోలీసులకు అప్పగించారు. భార్యతో గొడవ వల్లే తాను ఇలా చేశానని ముఖేష్ చెప్పాడు.
Full View