డ్రంకెన్ డ్రైవ్ లు ఎన్ని నిర్వహించినా.. తాగి నడపటంతో మీ ప్రాణాలకే కాదు.. ఎదుటోడి ప్రాణాలకు కూడా ముప్పేనంటూ ఎన్ని రకాలుగా చెప్పినా హైదరాబాద్ మహానగర మందుగాళ్లకు ఓ పట్టాన ఎక్కటం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి.. కేసులు నమోదు చేసినా.. జైలుకు పంపుతున్నా.. డ్రైవింగ్ లైసెన్స్ లు క్యాన్సిల్ చేసినా.. వారిలో మార్పు రావటం లేదు.
స్నేహితుల్ని వెంట పెట్టుకొని పార్టీలకు వెళ్లటం.. ఫుల్ గా తాగేసి ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అమాయకుల ఉసురు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో మరొకటి చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన నలుగురు యువతులు ఫుల్ గా తాగేసి.. పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కారును ఇష్టారాజ్యంగా నడిపారు.
కుషాయగూడ వద్దకు చేరుకునేసరికి వారి కారు అదుపు తప్పింది. దీంతో పుట్ పాత్ మీద నిద్రిస్తున్న చెప్పులు కుట్టే వ్యక్తి మీదకు కారును పోనిచ్చారు. వాయువేగంతో దూసుకెళ్లిన కారణంతో సదరు కార్మికుడు అక్కడికక్కడే మరణించారు. ఫుల్ గా మందుతాగి కారు నడిపిన అమ్మాయితో పాటు.. ఆమె స్నేహితులు నగరానికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఫుల్ గా తాగేసి కారు నడపవటమే కాదు.. తనిఖీలు జరుపుతున్న పోలీసుల మీదా నగరానికి చెందిన యువతులు దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పెద్దింటి అమ్మాయిలపైన కనీసం కేసులు నమోదు చేయటం లేదంటూ పోలీసుల తీరును పలువురు తప్పు పడుతున్నారు.