దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు టీఆర్ఎస్ పరువు తీసేశారు. వాస్తవానికి ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మండిపడుతున్న మాజీ జర్నలిస్టు అయిన రఘు నందన్-కు కొన్ని నిజాలు తెలిశాయి. వాటి గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడిక ఆయన.
వాస్తవానికి ఇటీవల కాలంలో కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీల లిస్టులో పదికి పది తమవే అని చెబుతున్న తెలంగాణ సీఎం, ఇందులో నిజం ఎంతో చెప్పాలన్నది రఘునందన్ డిమాండ్.
కేంద్రం ఎంపికచేసిన పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా టీఆర్ఎస్ రూలింగ్ ఉన్న ఎంపీలకు చెందినవి కావని, వాటిలో ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ రూల్ చేస్తున్న పార్లమెంట్ స్థానాలకు సంబంధించినవే అని, వాస్తవాలు చెప్పకుండా అసత్య ప్రచారం చేసుకోవడం తప్పు అని రఘునందన్ తన మామ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
అదేవిధంగా సీఎం దత్తత గ్రామాలు అయిన ముల్కనూర్, ఎర్రవల్లి, వాసాలమర్రి, నర్సన్నపేట పరిసర ప్రాంతాలలో చేసిన అభివృద్ధి ఏంటన్నది చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద తీసుకున్న దత్తత గ్రామాలకు ప్రగతి యోగం లేనేలేదని ఆర్ఆర్ చేస్తున్న ఆరోపణ.
ఇక తెలంగాణ ప్రభుత్వానికీ, కేంద్రానికీ మధ్య ఉన్న దూరం కారణంగానే బీజేపీ ఈ విధంగా ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ కౌంటర్..ఇవ్వవచ్చు గాక ! కానీ వాస్తవాలేంటో, గ్రామీణాభివృద్ధికి చేస్తున్నదేంటో, చెందుతున్నదేంటో ఓ సారి గణాంకాలతో సహా అధికార పార్టీ నేతలు వివరిస్తే బాగుంటుంది కదా! ఆ విధంగా అయినా బీజేపీ మాటే అబద్ధం కేసీఆర్ జవాబే నిజం అని తేలిపోతుంది అన్నది మరో వాదన గా వినవస్తోంది.