మనలో చాలామంది దోమ కుడితే లైట్ తీసుకుంటారు. దోమకాటుతో సాధారణంగా దురద రావడం.. వాపు వంటి సమస్యలు వస్తాయని సంగతి తెలిసిందే. మనిషిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దోమకాటుతో డెంగ్యూ.. మలేరియా.. టైపాయిడ్.. చికెన్ గున్యా.. బోదకాలు వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మనలో చాలామంది దోమ కాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని ఉండే ఉంటారు.
కాగా ఓ వ్యక్తి దోమ కాటుకు గురై దాదాపు నెలరోజులపాటు కోమాలోకి వెళ్లిపోయిన సంఘటన అందరినీ ఉలికి పడేలా చేస్తుంది. అంతేకాకుండా అతడికి వైద్యులు 30 సర్జరీలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ అరుదైన సంఘటన జర్మనీలోని రోడర్‌మార్క్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సెబాస్టియన్ రోట్‌ష్కే అనే 27 ఏళ్ల వ్యక్తి జర్మనీలోని రోడర్ మార్క్ లో నివాసం ఉంటున్నాడు. 2021 వేసవిలో సెబాస్టియన్ ఓ ఆసియన్ టైగర్ దోమకాటుకు గురయ్యాడు. ఈక్రమంలోనే అతడిలో మొదట ఫ్లూ వంటి లక్షణాలు కన్పించాయి. ఆ తర్వాత ఆ లక్షణాలు క్రమంగా పెరగడంతో ఆస్పత్రిలో చేరగా వైద్యులు అతడి కాలి రెండు వేళ్ళను పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది.
అయినప్పటికీ అతడి ఆరోగ్యం పూర్తిగా నయం కాలేదు. రక్తం విషపూరితంగా మారడంతో వరుసగా కాలేయం.. కిడ్నీ.. హృదయ.. ఊపిరితిత్తుల రోగాల బారిన పడ్డారు. ఈ క్రమంలోనే అతడు సుమారు నెలరోజులపాటు కోమాలోకి వెళ్లారు. వైద్యులు అతడికి ఏకంగా 30 సర్జరీ చేసి అతడి ప్రాణాన్ని కాపాడారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కొంతగా మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సెబాస్టియన్ రోట్ ష్కే తన అనారోగ్యంపై స్పందిస్తూ.. తాను విదేశాల్లోకి వెళ్లలేదని.. జర్మనీలోనే దోమలు కుట్టాయని తెలిపాడు. దోమకాటుతో మొదట జ్వరంగా బాగా వచ్చిందని.. దీంతో ఆహారం తినలేక పోయానని వెల్లడించాడు. తన ఎడమ తొడ భాగంలో దోమ కుట్టడంతో చీము పట్టిందని వాపోయాడు. వైద్యులు చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారని తెలిపారు.
అయినా కూడా తన ఎడమ తొడ భాగాన్ని సగం మేర బ్యాక్టీరియా తినేసిందని తెలిపాడు. తానిక బ్రతుకకపోవచ్చని భావించినా అయితే వైద్యులు తనకు 30 వరకు సర్జరీలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారని తెలిపాడు. ఆసియన్ టైగర్ దోమ కుట్టడం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారని సెబాస్టియన్ వివరించాడు.
ప్రతీఒక్కరూ దోమల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే తన ఆరోగ్యం పూర్తిగా నయం అవుతుందనే నమ్మకాన్ని సెబాస్టియన్ వెలిబుచ్చాడు. ఇకపోతే ఆసియన్ దోమలను అటవీ దోమలని కూడా అంటారు. ఈ దోమలు పగటి పూటి ఎక్కువగా కుడతాయి. వీటి వల్ల మెదడు వాపు.. చికెన్ గున్యా.. డెంగ్యూ.. జికా వైరస్.. వెస్ట్ లైన్ వైరస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.