వావ్.. వాటే కమిట్ మెంట్: కదిలే రైల్లోని కస్టమర్ కు డెలివరీ

Update: 2022-09-16 12:30 GMT
చేతిలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ కారణంగా ప్రపంచమే మారిపోయింది. కొన్ని అంశాల్లో మార్పులకు దశాబ్దాలు పట్టే పరిస్థితి. అలాంటి వాటిని స్మార్ట్ ఫోన్ల కారణంగా ఇట్టే మారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏదైనా ఫోటో తీయాలన్నా.. వీడియో తీయాలన్నా.. దాని కోసం పడే కసరత్తులు చాలానే ఉండేవి.

స్మార్ట్ ఫోన్ ఆ సమస్యకు పరిష్కారం చెప్పేయటమే కాదు.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు జరిగే చాలా పరిణామాలకు మూలంగా మారింది స్మార్ట్ ఫోన్. దీని దెబ్బకు సాదాసీదా వ్యక్తులు సైతం సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి హీరోలు అవుతున్నారు. వారు పడుతున్న కష్టానికి ఫలితం లభిస్తుంది. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

ముంబయిలో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఉదంతంలో.. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువుల్ని నిమిషాల వ్యవధిలో డెలివరీ చేసే డంజో కు ఒక అమ్మాయి ఆర్డర్ చేసింది. రైల్వే స్టేషన్ ను డెస్టినేషన్ గా చూపించింది. ఆర్డర్ చేసి.. తీరా డెలివరీ బాయ్ వచ్చేసరికి.. రైలు కదులుతున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఫ్లాట్ ఫాం మీద కదులుతున్న ట్రైన్ తో పోటీ పడి పరిగెత్తిన డెలివరీ బాయ్.. ఎట్టకేలకు ట్రైన్ డోర్ వద్ద నిలబడిన కస్టమర్ కు తాను ఇవ్వాల్సిన పార్సిల్ ను ఇచ్చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ట్రైన్ డోర్ దగ్గర నిలబడి.. త్వరగా రావాలంటూ సదరు మహిళా కస్టమర్ కోరటం.. ఫాస్ట్.. ఫాస్ట్ అంటూ పెద్ద ఎత్తున చేతులు ఊపిన ఆమెకు తగ్గట్లే.. డెలివరీ బాయ్ సైతం తన కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తూ.. వేగంగా పరిగెత్తి.. బోగీ వద్దకు చేరుకొని తన చేతిలోని పార్సిల్ ను ఆమెకు ఇచ్చేయటం.. దానికి ఆ అమ్మాయి పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేసిన వైనం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తాను చేయాల్సిన పనిని చేసే విషయంలో ఇబ్బందుల్ని పక్కన పెట్టేసిన సదరు డెలివరీ బాయ్ పై  సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

వైరల్ గా మారిన ఈ వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని కొందరు కోరితే.. అతడికి పది రెట్ల టిప్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే.. తాను చేసే పని విషయంలోఅతగాడి కమిట్ మెంట్ ను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మరి.. సదరు డెలివరీ బాయ్ పని చేస్తున్న డంజో ఆ యువకుడి కమిట్ మెంట్ కు ఎలా స్పందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News