తాజాగా జరిగిన ఎన్నికలలో హర్యానాలో హంగ్ ఫలితాలు రావడంతో బీజేపీ - జేజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ అనూహ్యంగా 10 సీట్లు కైవసం చేసుకుంది. దీనితో బీజేపీ జేజేపీ మద్దతు కోరడంతో జేజేపీకి డిప్యూటీ సీఎంతోపాటు రెండు మంత్రి పదవులు దక్కించుకోబోతోంది. అయితే, నిన్నమొన్నటి వరకు జేజేపీ అంటే ఎవరికీ తెలియదు. దీనికి కారణం ఈ పార్టీని ఏర్పాటుచేసి కనీసం ఏడాది కూడా పూర్తికాలేదు.
2018 డిసెంబర్ లో జన్ నాయక్ జనతా పార్టీని నెలకొల్పిన దుష్యంత్ చౌతాలా...తాజాగా జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లు సాధించి కింగ్ మేకర్ గా మారిపోయారు. అయితే, దుష్యంత్ చౌతాలా ఫ్యామిలీకి హర్యానాలో ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. దుష్యంత్ చౌతాలా ముత్తాత... దేవీలాల్ చౌతాలా హర్యానాకు రెండుసార్లు సీఎంగా పని చేశారు. ఇక, దుష్యంత్ తాత ఓం ప్రకాష్ చౌతాలా నాలుగుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే, చౌతాలా కుటుంబ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ లో జరిగిన అంతర్గత కుమ్ములాటే.. జేజేపీ ఏర్పాటు కావడానికి కారణమైంది.
కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దుష్యంత్ పోల్ మేనేజ్మెంట్ లో విజయం సాధించారు. జేజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రావన్న ఐఎన్ఎల్డీ అధినేత అభయ్ చౌతాలాకు పెద్ద షాక్ ఇస్తూ - ఇఫ్పుడు ఏకంగా 10 సీట్లు గెలిచి కింగ్ మేకర్ గా నిలిచారు. అయితే, చౌతాలా ఫ్యామిలీపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా - చివరికి ఫ్యామిలీ మొత్తం జైలుకెళ్లిచ్చినా ఆ కుటుంబానికి ఉన్న పట్టు, ఆదరణ తగ్గలేదని ఏమాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైంది.