ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్న మరోమారు పత్రికల్లోకి ఎక్కింది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, ఆ తర్వాత శివసేన-ఎన్సీపీలతో పొత్తు అపుడు, ఇటీవలి కాలంలో బీఫ్ పై నిషేధం విధించడంతో మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలోనే రోజు అత్యంత చెత్తను తయారు చేస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఖ్యాతి గడిరచింది!!
సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీడీ) ఇచ్చిన నివేదికలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో రోజుకు 26, 820 వేల టన్నుల చెత్త తయారవుతోందని సీపీసీడీ తన అధ్యయనంలో తేల్చింది. రోజుకు 19,190 టన్నుల చెత్త తయారితో ఉత్తర్ ప్రదేశ్ రెండో స్థానాన్ని కొట్టేసింది. పుణే, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో పురపాలక వ్యర్థాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్తను, చెత్త సమస్యను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ... స్వత్రంత్య, నిష్ఫక్షపాత నివేదికను ఇవ్వాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో సీపీసీడీ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయి సమాచారంతో 38 పేజీలున్న నివేదికను సీపీసీడి విడుదల చేసింది.
దేశంలోని 70 నగరాలు రోజుకు 100-150 టన్నుల చెత్తను పోగేస్తున్నాయని ఆ నివేదికలో తేలింది. అయితే పుణే, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్ లతో పాటు హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున చెత్త పోగేయ్యటంలో తమ పాత్ర పోషిస్తున్నాయని తేల్చింది. కేవలం ఈ నగరాల్లోని చెత్తే రోజుకు 500 టన్నులు ఉంటుందని తేల్చింది.
మరోవైపు చెత్త సమస్యను పరిష్కరించేందుకు కార్యచరణ ప్రణాళికను కూడా సీపీసీడి విడుదల చేసింది. అయితే ఈ ప్రతిపాదనలపై పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి