పగలే చీకటైంది.. ఢిల్లీలో మారిపోయిన వాతావరణం

Update: 2020-05-10 08:30 GMT
ఆదివారం ఉదయం. అప్పుడే తెల్లవారింది. ఆకాశం మబ్బు పట్టింది. వర్షం పడేలాంటి పరిస్థితి కాస్తా ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద ఎత్తున గాలి వీయటం మొదలైంది. దుమ్ము.. ధూళితో పెరిగిన ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని దట్టమైన మబ్బులు కమ్మేశాయి. రోడ్డు మీద వెళ్లే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి.

ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఉన్న వారు.. తలుపులు మూసేసి లోపలకు వెళ్లిపోతే.. రోడ్ల మీద ఉన్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులైతే ఎదురు వస్తున్న వాహనాల్ని గుర్తించలేక.. అదే పనిగా హారన్లు మోగించాల్సి వచ్చింది.

పెద్ద ఎత్తున వీచిన గాలులతో రోడ్లు మొత్తం దుమ్ము.. ధూళితో పాటు.. చెట్ల ఆకులతో కప్పేశాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పగలే అయినా చీకట్లు కమ్మేసి.. రాత్రి అయినట్లుగా వాతావరణం మారిపోయింది. సిత్రమైన వాతావరణ పరిస్థితితో రాజధాని వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పెద్ద ఎత్తున గాలులు వీయటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపేశారు అధికారులు.
Tags:    

Similar News