ఉత్తరాంధ్రా వైసీపీలో కుమ్ములాట స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 2019 ఎన్నికల్లో పాగా వేసిన వైసీపీకి బ్రహ్మాండమైన జనాదరణ లభించింది. ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28ని గెలుచుకుని జబ్బలు చరచింది. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉంటే అందులో నాలుగు ఫ్యాన్ పార్టీ పరం అయ్యాయి. జగన్ సునామీలో శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లకు గానూ కేవలం రెండు మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక విజయనగరంలో తొమ్మిది సీట్లు ఉంటే అన్నీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది వైసీపీ. ఇక విశాఖలో మొత్తం 15 సీట్లకు గానూ నాలుగు తప్ప అన్నీ వైసీపీ గెలుచుకుంది.
ఇంతలా వైసీపీ హవా చాటుకుంది, మరోసారి కూడా తిరుగులేని విజయం తమదేనని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రాలో అతి ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళంలోనే వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ వర్గ పోరు పీక్స్ చేరిపోయింది. ఏకంగా బాహాటంగా రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యర్ధి పార్టీల కంటే దారుణంగా నిందించుకుంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు రెండు దఫాలుగా గెలుస్తూ వస్తున్నారు. ఒక విధంగా ఆయన సొంత సీటు కిందనే లెక్క. 2019 లో అచ్చెన్న ఓటమి ఖాయమనుకున్నా వైసీపీలో ఉన్న మూడు వర్గాల వల్ల ఆయన ఎనిమిది వేల మెజారిటీతో గెలిచేశారు. ఇక టెక్కలిలో వైసీపీ బలంగా ఉన్నా మూడు వర్గాలు నిన్నటిదాకా ఉండేవి, అవి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పెరాడ తిలక్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్గాలు.
ఇందులో ఇపుడు కిల్లి కృపారాణి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. దాంతో ఆ వర్గం సైలెంట్ కాగా పేరాడ తిలక్ కి కాళింగ కార్పోరేషన్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. అయితే ఆయన గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసిన క్యాండిడేట్. తానే మరోసారి టెక్కలి నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. మరో వైపు చూస్తే దువ్వాడ శ్రీనును గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా నిలబెట్టిన వైసీపీ హైకమాండ్ అక్కడ ఆయన ఓడిపోవడంతో అచ్చెన్నను ఓడించాలని ఏరి కోరి తెచ్చి మరీ టెక్కలి ఇంచార్జిని చేసింది. దువ్వాడ కూడా 2014లో అచ్చెన్న మీద ఓడిన వారే.
అయితే ఇపుడు ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. అధికార పదవి చేతిలో ఉంది. జగన్ దగ్గర నేరుగా పలుకుబడి ఉంది. దాంతో పాటు వర్గాలు అన్నీ కూడా ఒకటి చేసి అచ్చెన్న మీదకు ఎగదోస్తే ఆయన ఓటమి కావడం ఖాయమని హై కమాండ్ మాస్టర్ స్కెచ్ బాగానే వేసింది. కానీ దువ్వాడకు పేరాడకు మధ్య గొడవలు అలాగే ఉన్నాయి. అవి నివురు గప్పిన నిప్పులా ఉంటూ ఒక్కసారి ఇపుడు బయటపడ్డాయి.
తాజాగా టెక్కలిలో వైసీపీలోని ఒక వర్గం మీడియా సమావేశం పెట్టి మరీ దువ్వాడ మీద దారుణమైన విమర్శలు చేసింది. ఆయన తన వర్గానికి అనుచరులకే పని చేస్తున్నారని, వైసీపీని పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆ వర్గం ఆరోపించింది. దువ్వాడ ఉంటే ఇక్కడ వైసీపీ గెలుపు డౌట్ అని కూడా పేర్కొంది. అందువల్ల ఆయన్ని తక్షణం టెక్కలి వైసీపీ ఇంచార్జి పదవి నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఈ వర్గం ఇంతలా దువ్వాడ మీద విమర్శలు చేయడం వెనక పేరాడ తిలక్ ఉన్నారని దువ్వాడ వర్గం అనుమానిస్తోంది. ఆయన వల్లనే పార్టీకి చెడ్డ పేరు వస్తోందని కూడా దువ్వాడ వర్గం మండిపడుతోంది. ముందు ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి రెండు బలమైన వర్గాలు ఒక్కటి కావడంలేదు. అధినాయకత్వం కూడా పట్టించుకోవడం లేదు, ఇదే తీరున ఉంటే కనుక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ఇక్కడ ఓటమి పాలు కావడం తధ్యమని అంటున్నారు. చూడాలి మరి టెక్కలిలో ఏం జరుగుతుందో. మొత్తానికి ఈ పరిణామాలు అచ్చెన్న వర్గానికి ఫుల్ జోష్ ని తెప్పిస్తున్నాయట.