కర్ర ఉన్నవాడి చేయి.. కత్తి ఉన్నవాడి చేయి ఊరుకోదంటూ... అలాగే మైకుపట్టుకున్నవారి నోరూ ఊరుకోదు... ఏదో ఒకటి మాట్లాడాలి.. సంబంధం ఉన్నది లేనిదీ గెలికి మరీ మాట్లాడాలి. ఎవరో ఒకరిని కవ్వించాలి... వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి సరిగ్గా అదే పనిచేశారు. వైసీపీ నేతలంతా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే ఆయన ఉరిమిఉరిమి మంగళం మీద పడ్డట్లుగా జనసేన నేత, సినీ హీరో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ కూడా చంద్రబాబులాగే ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. అవినీతిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ప్రస్తుతం ఏపీలో ఉన్న అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు అన్యాయానికి గురైనప్పుడు తానొచ్చి ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడా కనిపించడం లేదని ద్వారంరెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు అన్యాయమైపోతున్నారని... వారికోసం ప్రశ్నించడానికి పవన్ రావాలని అన్నారు.
మరి అవినీతిని ప్రశ్నించడానికి పవన్ రావాలంటున్న ద్వారంరెడ్డి ఆయనొచ్చి జగన్ ను ప్రశ్నించాలని ఎందుకడగలేదో మరి.. అవినీతిలో కింగ్ గా పేరొందిన జగన్ పార్టీలో ఉంటున్న ద్వారంరెడ్డికి అక్కడి అవినీతి తప్ప ప్రపంచంలోని మిగతా అవినీతి అంతా కనిపిస్తున్నట్లుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.