తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పకతప్పదు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. స్వైన్ ఫ్లూ విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సరైన వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరించకపోవటంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూను నిలువరించే వీలు ఉన్నప్పటికీ.. పాలకుల్లో నిర్లక్ష్యంగా అలాంటివి జరగకుండా అడ్డుకోవటం సాధ్యం కాని పరిస్థితి.
సామాన్యుడి సంగతి కాసేపు వదిలేద్దాం. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తికి స్వైన్ ఫ్లూకి గురయ్యారంటూ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పొచ్చు. రెండు రోజుల క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎంకు.. ఆయన సతీమణికి స్వైన్ ఫ్లూ సోకినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. ఆ వార్తల్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లుగా ప్రకటించారు.
గడిచిన రెండు.. మూడేళ్లలో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్యతో పాటు మరణాల శాతం బాగా తగ్గిందన్న ఆయన.. స్వైన్ ఫ్లూను నయం చేసే అన్ని రకాల వసతులు.. మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు వెల్లడించారు. అంతా బాగుంటే.. డిప్యూటీ సీఎంకే స్వైన్ ఫ్లూ ఎందుకు వచ్చినట్లు లక్ష్మారెడ్డి సాబ్..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/