'సైకిల్' ఎక్కిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

Update: 2016-01-02 10:41 GMT
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ రోజు సైకిల్ పై తిరిగారు. ఆయన తన కార్యాలయానికి కారులోరాకుండా  సైకిలు తొక్కుకుంటూ వచ్చారు.  ఢిల్లీలో వాహన కాలుష్య నివారణకు ఆప్ సర్కార్ సరి-బేసి విధానం ప్రవేశపెట్టడంతో కాలుష్య నివారణకు గాను ఆయన కారు దిగి సైకిలెక్కారు.
    
కాగా తొలిరోజున కార్ పూలింగులో వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెండో రోజు ఏకంగా క్యాబ్ మాట్లాడుకున్నారు. నిన్న ఆయన మరో ఇద్దరు మంత్రులతో కలిసి ఒకే కారులో వచ్చారు.  అయితే... శనివారం సరి సంఖ్య నంబర్లకే అనుమతి ఉండడం.. కేజ్రీవాల్ కార్ నంబరు బేసిసంఖ్య కావడంతో ఆయన క్యాబ్ మాట్లాడుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిల్చుని యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని అందులో ఆఫీసుకు వచ్చారు.
    
మొత్తానికి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రజల్లోకి అవగాహన పెరుగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎలాంటి మినహాయింపులు తీసుకోకుండా నిబంధనలు పాటిస్తుండడంతో చాలామంది ఆయన బాటలో సాగేందుకు సిద్ధమవుతున్నారు.
Tags:    

Similar News