దేశ ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం చేసినా మ‌నమ్మాయి చ‌రిత్ర సృష్టించింది

Update: 2019-07-11 07:40 GMT
నిజంగా ద‌రిద్రం అంటే మ‌న‌దే. ఎప్పుడూ క్రికెట్.. క్రికెట్ అని అదే ప‌నిగా గంట‌ల కొద్దీ మ్యాచ్ చూస్తూ వేలాది కోట్ల గంట‌ల్ని ఖ‌ర్చు చేసే మ‌నం.. గెలిస్తే న‌వ్వుతాం. ఓడితే ఏడుస్తాం. క్రికెట్ ను ప్రేమించొద్ద‌ని చెప్ప‌టం లేదు. కానీ.. వేరే క్రీడ‌లో చ‌రిత్ర సృష్టించిన మ‌న‌మ్మాయిని క‌నీసం గుర్తించ‌క‌పోవ‌టానికి మించిన దారుణం ఏముంటుంది?

బుధ‌వారం క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో జ‌రిగిన సెమీస్ లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిన సంగ‌తి తెలిసిందే. విప‌రీత‌మైన  వేద‌న‌లో ఉన్న ఇలాంటివేళ‌.. మ‌న‌మ్మాయి ఒక‌రు సాధించిన విజ‌యాన్ని అస్స‌లు గుర్తించ‌లేదు. జ‌నం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మీడియా సైతం లైట్ తీసుకోవ‌టం చూస్తే.. వామ్మో అనుకోవాల్సిందే. ఒక టీంగా టీమిండియా చేయ‌లేని ప‌నిని.. ఒక అమ్మాయి (మ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోని క్రీడాకారిణి) ప్ర‌పంచ స్థాయిలో స్వ‌ర్ణం సాధించింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు భార‌త స్పింట‌ర్ ద్యుతి చంద్‌.

ప్ర‌పంచ వంద మీట‌ర్ల ప‌రుగు విభాగంలో స్వ‌ర్ణం సొంతం చేసుకోవ‌టం ద్వారా చ‌రిత్ర సృష్టించింది. ద్యుతి సాధించిన స్వ‌ర్ణంలో మ‌రో రికార్డుకూడా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కే చ‌రిత్ర‌లో భార‌త్ కు చెందిన మ‌హిళ ఎవ‌రు ఈ ఘ‌న‌త‌ను సాధించినోళ్లు లేక‌పోవ‌టం. మ‌న దేశం నుంచి స్వ‌ర్ణం సాధించిన మొద‌టి మ‌హిళ‌గా ద్యుతిని చెప్పొచ్చు.

ఇట‌లీలోని నేపుల్స్ లో జ‌రుగుతున్న 30వ వ‌ర‌ల్డ్ యూనివ‌ర్సిటీ గేమ్స్ ఫైన‌ల్ లో ఆమె 11.32 సెక‌న్ల స‌మ‌యంలో ఆమె ప‌రుగు పూర్తి చేసింది. గ‌తంలో ఏషియ‌న్ గేమ్స్ లో రెండు స్వ‌ర్ణాల‌ను ఆమె సాధించారు. ఆమె లైంగిత‌క మీద ప‌లు వివాదాలు ఉన్నాయి. ఇలాంటివేళ‌లోనూవాటిని ప‌ట్టించుకోకుండా గెలుపు దిశ‌గా దూసుకెళ్లిన ద్యుతి విజ‌యాన్ని దేశ ప్ర‌జ‌లు గుర్తించ‌క‌పోవ‌టం బాధ క‌లిగించే అంశం. అయితే.. గెలుపు త‌ప్పించి మ‌రేమీ ప‌ట్టించుకోని ద్యుతి లాంటి క్రీడాకారిణి మ‌న నిర్ల‌క్ష్యం గురించి లైట్ తీసుకుంటుందిలే!
Tags:    

Similar News