ఆ ఏడు కంపెనీలే టాప్‌

Update: 2015-10-25 22:30 GMT
ఇండియాలోని ఈ-కామర్స్ సంస్థలకు వ్యాపారంతో పాటు పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బు వచ్చిపడుతోంది. భారత్‌ లో చురుకుగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీల్లో మొత్తం ఏడు కంపెనీలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. సీక్వోయా కేపిటల్‌ - టైగర్‌ గ్లోబల్‌ - యాక్సెల్‌ పార్ట్ నర్స్‌ సంస్థలు పెట్టుబడులపరంగా ముందుంటున్నాయి. ఇన్వెస్టర్లు చేపట్టిన డీల్స్‌ సంఖ్య ఆధారం గా నిర్ణయించారు . ఇవికాకుండా కొన్ని సంస్థల్లో జపాన్‌ సాప్ట్‌ బ్యాంక్‌ - చైనా ఆలిబాబా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

పెట్టుబడుల్లో అధిక భాగం ఇటెయిల్ మార్కెట్ లోనే పెడుతున్నారు. సీక్వోయా కేపిటల్‌ మొత్తం 41 డీల్స్‌ కుదుర్చుకుంది.  ప్రాక్టో - గ్రోఫర్స్‌ - మొబిక్విక్‌ - పెప్పర్‌ ట్యాప్‌ - వూంనిక్‌ - అర్బన్‌ ల్యాడర్‌ - జొమాటో - ఓలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. స్టార్టప్‌ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది.

ఇక టైగర్‌ గ్లోబల్‌ 29డీల్స్‌ లో పెట్టుబడులు పెట్టింది. ఫ్లిప్‌ కార్ట్‌ - ఓలా - క్వికర్‌ - షాప్‌ క్లూస్‌ - డెలివరీ సంస్థల్లో పెట్టుబడులు భారీ మొత్తంలో పెట్టింది. అంతేకాకుండా న్యూస్‌ ఇన్‌ షార్ట్స్‌ - కల్చర్‌ ఎల్లీ - ఆథర్‌ ఎనర్జీల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఇక ఫ్లిప్‌ కార్ట్‌ మింత్రా - కామన్‌ ఫక్ష్లర్‌ - ఫ్రెష్‌ డెస్క్‌ సంస్థలు ఈ పోర్టు ఫోలియోలో ముందున్నాయి.

యాక్సెల్‌ పార్టనర్స్‌ పోర్టీ - బ్లూస్టోన్‌ - మైస్మార్ట్‌ ప్రైస్‌ - కవర్‌ ఫాక్స్‌ బీమా - స్క్రిప్‌ బాక్స్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.

సైఫ్‌ 21 డీల్స్‌ లో పెట్టుబడులు పెట్టింది మొత్తం 350మిలియన్‌ డాలర్లు ఈమార్చి నెలలో పెట్టుబడులు పెట్టింది. ట్రాక్సన్‌ - జూమో - టాపర్‌ - నోబ్రోకర్‌ సంస్థలు ఈపోర్టుఫోలియోలో ఉన్నాయి.

హీలియాన్‌ వెంచర్‌ పార్టనర్స్‌ 16 డీల్స్‌ నిర్వహించింది. గ్రోసియరీ సంస్థ బిగ్‌ బాస్కెట్‌ - డేటింగ్‌ యాప్‌ ట్రూలీ మ్యాడ్లీ - ఇంటర్నెట్‌ ఆధారిత బిజినెస్‌ లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. మొబైల్‌ మార్కెటింగ్‌ సంస్థ మోఎంగేజ్‌ - పేమెంట్స్‌ సంస్థ ఈజీట్యాప్‌ వంటివాటిలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఇక ఐడిజి వెంచర్స్‌ పరంగా చూస్తే 16 డీల్స్‌ పూర్తిచేశాయి. ఐడిజివెంచర్స్‌ ఇండియా మొబైల్‌ కామర్స్‌ఆగ్రోస్టార్‌ - మొబైల్‌ చెల్లింపుల సంస్థ మోమే - ఆసన్‌ జాబ్స్‌ - ఐకేర్‌ స్టోర్‌ లెన్స్‌ కార్ట్‌ లలో పెట్టుబడులుపెట్టింది. ఇక కలారి కేపిటల్‌ 15 డీల్స్‌ పూర్తిచేసింది. దక్షిణ భారత్‌ లో  మార్షల్‌ ఆర్ట్స్‌ పేరుతో ఉన్న కలారి మొబైల్‌ గేమ్స్‌ డవలపర్‌ రోబోసాప్ట్‌ - మీడియా సైట్‌ యువర్‌ స్టోరీ - లింగరీ - ఇటైలర్‌ జివామే సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.

మొత్తానికి ఆన్ లైన్ భారత్ నే కాకుండా ప్రపంచాన్నంతటినీ ఆకర్షిస్తోంది. అందుకే విదేశీ సంస్థలు కూడా వచ్చి ఇక్కడి కొత్తకొత్త ఈ కామర్స్ సంస్థల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
Tags:    

Similar News